High Court on Governor: గవర్నర్‌ కోటా MLCల నియామకంపై హైకోర్టు తీర్పు.. గవర్నర్‌‌కు హైకోర్టు కీలక ఆదేశం

గవర్నర్‌ కోటా MLCల నియామకంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దాసోజు శ్రవణ్‌, కూర సత్యనారాయణ ఎన్నికను గవర్నర్‌ పునఃపరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో కోదండరామ్, అమీర్‌ అలీఖాన్‌ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను హైకోర్టు కొట్టేసింది. కేబినెట్‌ నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాలని, కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని ఆదేశించింది. దాసోజు శ్రవణ్‌, కూర సత్యనారాయణ నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్‌కు లేదన్న హైకోర్టు, కేబినెట్‌కు తిప్పిపంపాలి తప్పా.. తిరస్కరించకూడదని సూచించింది.

Governor Quota Mlcs
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 07, 2024 | 1:05 PM

గవర్నర్‌ కోటా MLCల నియామకంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దాసోజు శ్రవణ్‌, కూర సత్యనారాయణ ఎన్నికను గవర్నర్‌ పునఃపరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో కోదండరామ్, అమీర్‌ అలీఖాన్‌ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను హైకోర్టు కొట్టేసింది. కేబినెట్‌ నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాలని, కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని ఆదేశించింది. దాసోజు శ్రవణ్‌, కూర సత్యనారాయణ నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్‌కు లేదన్న హైకోర్టు, కేబినెట్‌కు తిప్పిపంపాలి తప్పా.. తిరస్కరించకూడదని సూచించింది.

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్ అలీఖాన్‌లను నామినేట్ చేయగా.. ఆమోదముద్ర వేశారు గవర్నర్‌ తమిళసై. అయితే.. ఈ అంశాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించొద్దని ఆదేశిస్తూ.. గతంలో విచారణను హై కోర్టు వాయిదా వేసింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నామినేట్ చేస్తూ లిస్టును గవర్నర్‌కు పంపారు. అయితే.. గవర్నర్ తిరస్కరించడంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…