Telangana: అల్పపీడనం ఎఫెక్ట్… తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

తెలంగాణ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపుల ఉంటాయని.. పలు చోట్ల పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అన్నారు.

Telangana: అల్పపీడనం ఎఫెక్ట్... తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
Telangana Weather
Follow us

|

Updated on: Aug 24, 2024 | 1:57 PM

తెలంగాణలో కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. రాజధాని హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వర్షాలు దండిగా పడుతున్నాయి. కాగా వర్షాలు మరో 3 రోజులు కొనసాగుతాయని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. శనివారం, ఆదివారం, సోమవారం భారీ వర్షాలు ఉంటాయని అంచనా వేసింది. ఉత్తర పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య జార్ఖండ్‌ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.. రెయిన్స్ ఉంటాయని వెల్లడించింది. ఇక అల్పపీడనానికి అనుబంధంగా.. ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో కేంద్రీకృతమైందని స్పష్టం చేసింది.

శనివారం కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్‌, కరీంనగర్, ములుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మెదక్‌, నిర్మల్‌, కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్‌, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందన్నారు. వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపుల ఉంటాయని.. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఆగస్టు 25, ఆదివారం… హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, నిజామాబాద్‌, జగిత్యాల, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపలపల్లి,వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు ఉంటాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..