AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Updates: ముంచుకొస్తున్న మరో తుఫాన్.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. ఐఎండీ హెచ్చరిక ఇదే..

బంగాళాఖాతం, అండమాన్ దీవులపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తుఫాన్‌గా మారే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రాబోయే మూడ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో జల్లులు పడుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

Weather Updates: ముంచుకొస్తున్న మరో తుఫాన్.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. ఐఎండీ హెచ్చరిక ఇదే..
Rains
Venkatrao Lella
|

Updated on: Oct 23, 2026 | 4:16 PM

Share

ఆగ్నేయ, ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ దీవులపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్ 23న ఉదయం 05.30 గంటలకు ఆగ్నేయ, ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది చాలావరకు అదే ప్రాంతంలో కొనసాగి అక్టోబర్ 24న వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. అక్టోబర్ 25న మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, అక్టోబర్ 26 ఉదయం నాటికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది మరింత బలపడి, రాబోయే 2 రోజులలో ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా తీరాల వైపు పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుంది.

ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న లక్షద్వీప్‌పై ఏర్పడిన అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి కేరళ మీదుగా ఉత్తర కోస్తా తమిళనాడు వరకు విస్తరించి, సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించింది. ఉత్తర కోస్తా తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం పైన పేర్కొన్న ద్రోణితో విలీనమైంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ఈరోజు తేలికపాటినుండి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల గరిష్టముగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. రేపు, ఎల్లుండి  తేలికపాటినుండి నుండి మోస్తరు వర్షాలు జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటినుండి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల గరిష్టముగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రమం పేర్కొంది.

తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో కూడా రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకావముంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో వానలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Follow Us