నిరుద్యోగులకు శుభవార్త… తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్..?

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలవబోతుందా? త్వరలో భారీ పోస్టులతో ఉద్యోగ ప్రకటన వెలువడబోతుందా? ఈ ప్రశ్నలకు అధికార..

నిరుద్యోగులకు శుభవార్త... తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్..?
Follow us

|

Updated on: Dec 16, 2020 | 9:07 AM

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలవబోతుందా? త్వరలో భారీ పోస్టులతో ఉద్యోగ ప్రకటన వెలువడబోతుందా? ఈ ప్రశ్నలకు అధికార వర్గాలు అవుననే సమాదానం చెబుతున్నాయి. తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి నుంచీ పోలీసు శాఖకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు.. ఆ మేరకు నియామకాలు కూడా చేపడుతున్నారు. ఇప్పటికే 20వేలకు పైగా పోలీసు ఉద్యోగ నియమకాలు చేపట్టగా.. ఇప్పుడు తాజాగా మరో భారీ నోటిఫికేషన్‌ విడుదలకు రంగం సిద్దం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, మండలాలు పెరిగిన నేపథ్యంలో పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసు శాఖలో 20వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు పోస్టులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. ఆ నివేదికలో రాష్ట్ర వ్యాప్తంగా 425 ఎస్సై పోస్టులు అవసరమని పేర్కొన్నారు. దీనిలో ఎస్సై సివిల్‌-368, ఏఆర్‌-29, కమ్యూనికేషన్స్‌-18 పోస్టులు ఉన్నాయి. 19,300 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీచేయాలని నివేదికలో తెలిపారు. వీటిలో సివిల్‌-7764, ఏఆర్‌-6683, టీఎస్‌ఎస్‌పీ-3874, కమ్యూనికేషన్స్‌-256, 15వ బెటాలియన్‌లో 561 ఖాళీలు ఇందులో ఉన్నాయి. ఇదిలాఉంటే.. వయోపరిమితి సడలింపుపై నోటిఫికేషన్‌ సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Also read:

డబ్బు కోసం గ్రామ వాలంటీరైన భర్త బాబూరావుతో కలిసి అమ్మానాన్నలను హత్యచేసిన కూతురు మనీషా.. కృష్ణాజిల్లాలో దారుణం.!

రుణ గ్రహీతలు పెరిగారు… కరోనా కాలంలో పెరిగిన వ్యక్తిగత రుణాలు.. రెండేళ్లలో 5 రెట్లు పెరిగిన మార్కెట్