వర్షా కాలం మొదలయ్యేలోపు ఈ పండు తినేయండి.. ఎందుకంటే?

05 June 2026

TV9 Telugu

TV9 Telugu

వర్షాకాలం.. మరో వారంలో వచ్చేస్తుంది. వానలతోపాటూ జలుబు, దగ్గు, జ్వరాలు లాంటి ఎన్ని సమస్యల్ని వెంటబెట్టుకుని వస్తుందో. పిల్లల్నీ, పెద్దల్నీ ఈ అనారోగ్యాల బారిన పడకుండా కాపాడటానికి అమ్మలు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో..

TV9 Telugu

అవన్నీ విఫలయత్నాలైతే... సమస్యల్ని దూరం చేయడానికి వాళ్లకు తెలిసిన వంటింటి చిట్కాలన్నీ పాటిస్తారు. వీటన్నింటి బదులు కాలానికి అనుగుణంగా ప్రకృతి ఇచ్చే పండ్లని తినడం మేలంటారు నిపుణులు

TV9 Telugu

అలా ఈ కాలంలో వచ్చే పండ్లలో ఆలూ బుఖారాలు ఒకటి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

చెడు కొవ్వును తగ్గించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు, వీటిల్లో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది

TV9 Telugu

గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయుల్ని నియంత్రిస్తాయివి. అలానే, విటమిన్‌-సి, కె... రోగనిరోధక శక్తిని పెంచుతుంది

TV9 Telugu

వర్షా కాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పండ్లలో ఫైబర్‌ కూడా ఎక్కువే

TV9 Telugu

మలబద్ధకం లాంటి జీర్ణ సంబంధిత సమస్యలకు ఇవి చక్కని ఉపశమనం. తీపి, పులుపు సమ్మేళనంతో తినడానికీ బాగుంటాయి

TV9 Telugu

కాబట్టి పిల్లలు కూడా బెట్టు చేయకుండా తినేస్తారు. వ్యాధి వచ్చాక జాగ్రత్తలు తీసుకుంటూ బాధపడేకంటే... రాకుండానే నివారణ చర్యలు తీసుకోవడం మేలు కదూ..