AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. రూ.185 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య రంగంలో కీలక మార్పులు తీసుకువస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆస్పత్రులను మెరుగు పర్చారు. కార్పొరేట్‌..

Telangana: తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. రూ.185 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి
Telangana
Subhash Goud
|

Updated on: Jul 19, 2022 | 7:19 PM

Share

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య రంగంలో కీలక మార్పులు తీసుకువస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆస్పత్రులను మెరుగు పర్చారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేసుకోలేని వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలోని ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. త్వరలో పటాన్ చెరులో 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ఆస్పత్రి నిర్మాణానికి రు.185 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఈ ఆస్పత్రిని కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

Harish Rao

పటాన్‌ చెరులో బస్తీ దవాఖానలు ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

తాజాగా ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పటాన్‌ చెరులో బస్తీ దవాఖానలు ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడారు. పటాన్ చెరువు నియోజకవర్గంలో 10 బస్తి దవాఖానలు మంజూరు చేయడం జరిగిందని, బీరంగూడ, లింగమయ్య కాలనీ, బంధం కొమ్ములో ఈరోజు బస్తీ దవాఖానలు ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు. పేదల సుస్తీ పోగొట్టెలా బస్తీ దవాఖానలు పని చేస్తున్నాయని, అందుకే ప్రజాప్రతినిధులు మా వద్ద ఏర్పాటు చేయాలని అడుగుతున్నారని అన్నారు. సాధారణ ప్రసవాలకు ఎక్కువ ఖర్చు చేయాల్సిన రోజులు ఇవి. ప్రైవేటులో సాధారణ ప్రసవాలు కోసం పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రజలు ఆలోచించాలి. అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవం చేసుకుంటే తల్లి, పిల్ల బాగుంటారు అని అన్నారు. అమీన్ పూర్ మున్సిపాలిటీ 25 కోట్లతో పనులు చేస్తాం. దసరా పండుగ వరకు కొత్త పింఛన్లు ఇస్తాము. అర్హులైన వారికి రేషన్ కార్డులు దసరా వరకు ఇస్తాం. స్థలం ఉన్నవారికి ఇంటిని నిర్మిస్తామని అన్నారు. అమీన్ పూర్ దశ, దిశను మార్చింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి