Godavari Floods: భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి వరద ఉధృతి.. 53.40 అడుగులకు చేరిన నీటిమట్టం..
Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి భారీగా పెరిగింది. అక్కడ నీటి మట్టం 53.40 అడుగులకు చేరింది.
Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి భారీగా పెరిగింది. అక్కడ నీటి మట్టం 53.40 అడుగులకు చేరింది. డిచార్జ్ వాటర్ 14,45,237 క్యూసెక్కులుగా ఉంది. భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా, వరదల నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు.
తప్పిన పెను ప్రమాదం.. నేరడిగొండ మండలం దర్బతాండ వాగులో ఇద్దరు యువకులు చిక్కుకున్నారు. బైక్ పై వాగు దాటే సాహసం చేసి వాగులో కొట్టుకు పోయారు ఇద్దరు యువకులు. బుగ్గారానికి చెందిన ఆడే రామరావు, ఆడే ఉపేందర్ లు వాగు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, వెంటనే అలర్ట్ అయిన స్థానికులు.. కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను కాపాడారు. వరద ఉదృతికి బైక్ కొట్టుకుపోగా.. ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు