Godavari Express: గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం.. ప్రాణ నష్టం తప్పడానికి రీజన్ అదే…

గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఆ తర్వాత సేఫ్‌గా ఉన్న బోగీలతో తిరిగి రైలు హైదరాబాద్ చేరుకుంది. ఇంతేనా.. ! కాదు.. ఇది సాదాసీదా వార్త కాదు. రైలు పట్టాలు తప్పడం, దానికి కారణాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంతా భయానకం..!

Godavari Express: గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం.. ప్రాణ నష్టం తప్పడానికి రీజన్ అదే...
Godavari Express Derailed
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 15, 2023 | 11:25 AM

ట్రైన్‌ వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. ఆ స్పీడ్‌లో రైలు పట్టాలు తప్పితే ఏం జరుగుతుంది. సాధారణంగా అయితే ట్రైన్‌ మొత్తం తుక్కుతుక్కైపోతుంది. ఇంజిన్‌ దగ్గర్నుంచి బోగీలన్నీ ఒకదానిపై మరొకటి పడటమో లేక బోల్తా కొట్టడమో జరుగుతుంది. మొన్నటివరకూ జరిగింది కూడా అదే. కానీ, గోదావరి ఎక్స్‌ప్రెస్‌ విషయంలో అలా జరగలేదు. దానికి కారణంగా లేటెస్ట్‌ టెక్నాలజీతో రూపొందించిన ఆధునిక బోగీలు. ఇవే, ఇప్పుడు గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికుల ప్రాణాలను కాపాడాయ్‌. అవును, గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా బీబీనగర్‌ దగ్గర పట్టాలు తప్పింది ట్రైన్‌. అయితే, ఆధునిక బోగీలు కావడంతో ఒకదానిపై మరొకటి పడకుండా ట్రాక్‌పైనే ఆగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన టైమ్‌లో ట్రైన్‌ వంద కిలోమీటర్ల వేగంతో ఉందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. భారీ శబ్ధంతో ట్రైన్‌ పట్టాలు తప్పిందని, ప్రయాణికులంతా భయంతో హాహాకారాలు చేశారని అంటున్నారు. ట్రైన్… వంద కిలోమీటర్ల వేగంతో ఉండగా గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఆ వేగానికి ట్రైన్‌ మొత్తం బోల్తా కొట్టాలి, కానీ ఆధునిక టెక్నాలజీతో తయారుచేసిన బోగీలు కావడంతో ఘోర ప్రమాదం తప్పిందంటున్నారు నిపుణులు. LHB సిస్టమ్‌ ఉండడం వల్ల చక్రాలు పక్కకు పోకుండా.. లోపలికి కుచించుకొచ్చాయి. ఫలితంగానే ట్రైన్ ఒరిగిపోలేదు.. మరో బోగీతో డీకొనలేదు అదే పాత బోగీలైతే ప్రాణనష్టం ఊహించనిస్థాయిలో ఉండేదంటున్నారు.

– LHB అంటే ఏంటి? – గతంలో మన రైళ్లకు టెక్నాలజీ ఇంటిగ్రల్‌ కోచ్ ఫ్యాక్టరీ-ICF కోచ్‌లు – 2003 నుంచి అందుబాటులోకి లింక్‌ హాఫ్‌మాన్‌ బుష్‌ – LHB కోచ్‌లు – 110కి.మీల వేగానికి డిజైన్‌ అయిన ICF కోచ్‌లు – 160కి.మీల వేగాని డిజైన్ చేసిన LHB కోచ్‌లు – LHB ఉన్న కోచ్‌ల ఎత్తు పొడవు, సాధారణం కంటే అధికం – గోదావరి ఎక్స్‌ప్రెస్‌కి రెండేళ్ల నుంచి అందుబాటులో LHB కోచ్‌లు – ప్రతీ బోగికీ ఒక జత LHB సిస్టమ్‌ డివైజ్‌లు – LHB బోగీలకు ఎర్తింగ్, ఆటోమెటిక్ ఎయిర్‌ బ్రేకింగ్ సిస్టమ్‌ – రైలు పట్టాలు తప్పినా బోగీలు ఢీకొనడం అసాధ్యం – చక్రాలు ట్రాక్‌ లోపలే ఉండేలా LBH వ్యవస్థ – LBH బోగిలు పూర్తిగా షాక్‌ ప్రూఫ్‌, ఫ్యూయల్ కన్‌జక్షన్ టెక్నాలజీ – ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రైన్‌ పక్కకు ఒరిగే చాన్స్‌ నిల్‌ – దక్షిణ మధ్య రైల్వేలో వందరైళ్లకు LBH సిస్టమ్‌ – త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రైళ్లకు LHB

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందన్నారు సౌత్‌ సెంట్రల్‌ GM అరుణ్‌ కుమార్‌. అసలేం జరిగిందన్న అంశంపై..పూర్తి స్థాయిలో విశ్లేషణ జరుపుతున్నామన్నారు. ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని..వారిని సేఫ్‌గా ఉన్న బోగీల్లోకి మార్చి సికింద్రాబాద్‌కు తరలించినట్టు తెలిపారు. ఉదయం 6.10కి రైలు పట్టాలు తప్పిందని పైలట్‌ నుంచి సమాచారం అందిందని..వెంటనే అక్కడికి చేరుకొని ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని..పూర్తి మరమ్మతులు రాత్రికి పూర్తయ్యే అవకాశమున్నట్టు వెల్లడించారు. 400మీటర్ల మేర ట్రాక్‌ డ్యామేజ్‌ అయిందన్న GM అరుణ్‌కుమార్‌.. సిమెంట్‌ స్లీపర్స్‌ చాలా వరకు ధ్వంసమైనట్టు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..