ఇలా ఎందుకు చేశావమ్మా..! ఉండనని చెప్పినా హాస్టల్‌కు పంపించారని.. ఆ బాలిక ఏం చేసిందంటే..

వీర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన ఆశ్వితకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గత రెండు సంవత్సరాల క్రితం ఆరో తరగతిలో సీటు వచ్చింది. దీంతో తల్లిదండ్రులు పాఠశాలలో ఆమెను జాయిన్ చేశారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

ఇలా ఎందుకు చేశావమ్మా..! ఉండనని చెప్పినా హాస్టల్‌కు పంపించారని.. ఆ బాలిక ఏం చేసిందంటే..
Crime News (Representative image)
Follow us
G Sampath Kumar

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 21, 2024 | 12:27 PM

హాస్టల్లో ఉండలేక ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకింది.. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వీర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన ఆశ్వితకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గత రెండు సంవత్సరాల క్రితం ఆరో తరగతిలో సీటు వచ్చింది. దీంతో తల్లిదండ్రులు పాఠశాలలో ఆమెను జాయిన్ చేశారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కూతురుకు ఉన్నత చదువులు చదివించాలన్న సంకల్పంతో కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేర్పించారు.

అయితే గత కొంత కాలంగా హాస్టల్లో ఉండడం ఇష్టం లేదని ఆశ్విత తల్లిదండ్రులకు చెప్పింది. అయితే.. ఆమెకు ఎలాగొలా నచ్చజెప్పారు. పై చదువులు చదువుకుంటే.. ఉన్నత స్థానంలో ఉండొచ్చని తల్లిదండ్రులు ఆశ్వితకు పలుమార్లు చెప్పారు.. అయినా చిన్నారి వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే సెలవుల నేపథ్యంలో ఇంటికెళ్లింది.. తాను మళ్లీ హాస్టల్ కు వెళ్లనని.. అశ్విత చెప్పగా.. ఒక పది రోజులపాటు చదువుకుంటే దసరా సెలవులు వస్తాయని కాస్త ఓపిక చేసుకుని ఉండాలని చెప్పి నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రులు పాఠశాలకు పంపించారు.

అయితే, అశ్వితకు హాస్టల్లో ఉండడం ఇష్టం లేక రాత్రి బిల్డింగ్ పై నుండి దూకింది. కింద పడిన ఆశ్వితను చూసిన తోటి విద్యార్థులు.. ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పారు. దీంతో అధికారులు తల్లిదండ్రులకు సమచారం ఇచ్చి హుటాహుటిన ఆ బాలికను ప్రవైట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంటున్నారు.

తల్లి తండ్రులను వివరణ అడుగగా వసతి గృహంలో ఉండటం ఇష్టం లేక  అశ్విని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ అశ్విత చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సందర్శించి ఆరోగ్యంపై డాక్టర్లను వివరణ అడిగారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రాణాపాయం లేదని తెలిపారు. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఆశ్విత తల్లిదండ్రులకు ధైర్యంగా ఉండాలని కూతురిని బాగ చూసుకోవాలని సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..