Telangana: ఒరెయ్ ఎలారా ఇలా.. ట్రాక్టర్ ట్రక్కు ఎత్తగానే కుప్పలు తెప్పలుగా
ఎస్.. ఇదీ నిజంగా పుష్ప సీనే. అది కూరగాయల వాహనం. చూసే వారికి అది ట్రాక్టరే. కాని కింది భాగం తెరిచే చూస్తే మాత్రం దాని ఓనర్ అసలు రంగుబయట పడుతుంది. వాహనం కింది భాగంలో ఓ బాక్సును ఏర్పాటు చేసుకుని కొన్ని రోజులుగా గంజాయి తరలిస్తుంది ముఠా.
ఒరెయ్.. ఎలా వస్తాయ్‌రా మీకు ఇలాంటి థాట్స్. ఇవే ఇస్మార్ట్ ఐడియాలు బాగు పడటానికి వాడొచ్చు కదా. కేటుగాళ్లు.. పుష్ప రేంజ్ ఐడియాలతో రెచ్చిపోతున్నారు. మా క్రియేటివిటీ చూస్తారా అంటూ.. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగానికి అడ్డుకట్టవేయడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. మేం తగ్గేది లేదంటున్నారు స్మగ్లర్లు. ముఖ్యంగా గంజాయి రవాణా కోసం.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.
గురువారం రాత్రి హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధి అనంత్‌సాగర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ ట్రాక్టర్ అనుమానాస్పదంగా కనించడంతో ఆపి చెక్ చేశారు. అయితే ఊహించని రీతిలో ట్రాలీ కింద స్పెషల్‌గా తయారు చేసిన అరలో ఏకంగా 338 కిలోల గంజాయిని తరలిస్తుండటం చూసి కంగుతిన్నారు. ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం పాతకోటకు చెందిన లక్ష్మీనారాయణ ఒడిశా రాష్ట్రం చిత్తరకొండ ఏరియాలో గంజాయిని కొనుగోలు చేసి, కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..