సరదాగా తండ్రి వెంట వ్యవసాయ పొలానికి వెళ్లిన నాలుగేళ్ల కొడుకు.. ఇద్దరి ప్రాణం తీసిన సర్వీస్ వైర్..!
ఇదో హృదయవిదారక ఘటన.. ముద్దుల కొడుకును వెంట పెట్టుకుని వ్యవసాయ పొలానికి వెళ్లిన తండ్రి.. అటు నుంచే అటే ఇద్దరూ అనంత లోకాలకు పయనమయ్యారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన నాలుగేళ్ల కొడుకు వ్యవసాయ బావిలో పడిపోయాడు. కొడుకును కాపాడేందుకు వెళ్లి తండ్రి ప్రాణాలు వదిలాడు. ఈ హఠాత్తు పరిణామంతో ఊరు ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇదో హృదయవిదారక ఘటన.. ముద్దుల కొడుకును వెంట పెట్టుకుని వ్యవసాయ పొలానికి వెళ్లిన తండ్రి.. అటు నుంచే అటే ఇద్దరూ అనంత లోకాలకు పయనమయ్యారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన నాలుగేళ్ల కొడుకు వ్యవసాయ బావిలో పడిపోయాడు. కొడుకును కాపాడేందుకు వెళ్లి తండ్రి ప్రాణాలు వదిలాడు. ఈ హఠాత్తు పరిణామంతో ఊరు ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వ్యవసాయ భావి వద్ద ప్రమాదవశాత్తు విద్యుతాఘాతానికి గురై తండ్రికొడుకులు బావిలో జారిపడి దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా బలరాం తండా లో జరిగింది. తండాకు చెందిన మదిన్ (32 ), తన నాలుగేళ్ల కుమారుడు లక్షిత్ తో కలిసి తాము సాగు చేసే పొలం వద్ద భోజనం చేశారు. అనంతరం కుమారుడిని భుజంపై ఎత్తుకుని పొలం దున్నేందుకు వెళ్తుండగా విద్యుత్ మోటర్ సర్వీసు వైర్ తలకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్ సంభవించి ఇద్దరు వ్యవసాయ బావిలో జారి పడి పోయారు.
కొడుకు చిన్నవాడు కావడం, తండ్రికి ఈత రాకపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కొద్ది సేపటి తరువాత చుట్టుపక్కల రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 2 గంటల పాటు శ్రమించి తండ్రి మృతదేహాన్ని బావి లో నుంచి బయటకు తీశారు. కుమారుడి మృతదేహం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బంధుమిత్రులు , తండా వాసుల రోదనలు మిన్నంటాయి. తండాలో విషాధచాయలు అలుముకున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
