AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాపారి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌.. పురుగుల మందుతాగి సూసైడ్‌!

నిత్యం ఎందరో యువత ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు ఆడి చేతిలో డబ్బు అంతా నష్టపోతున్నారు. మరికొందరు అప్పులు చేసిమరీ పీకల్లోతు కష్టాలు తెచ్చుకుంటున్నారు. చివరికి దీని నుంచి బయటపడే మార్గంలేక ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్నారు. తాజాగా మరొక ఘటన నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం రాణాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. సారంగాపూర్‌ ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం..

వ్యాపారి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌.. పురుగుల మందుతాగి సూసైడ్‌!
Trader Committed Suicide Due To Online Betting
Srilakshmi C
|

Updated on: Jan 25, 2026 | 7:58 AM

Share

సారంగాపూర్, జనవరి 25: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఎందరో యువత ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు ఆడి చేతిలో డబ్బు అంతా నష్టపోతున్నారు. మరికొందరు అప్పులు చేసిమరీ పీకల్లోతు కష్టాలు తెచ్చుకుంటున్నారు. చివరికి దీని నుంచి బయటపడే మార్గంలేక ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్నారు. తాజాగా మరొక ఘటన నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం రాణాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. సారంగాపూర్‌ ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం..

నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం రాణాపూర్‌ గ్రామంకి చెందిన జాదవ్‌ ప్రేమ్‌కుమార్‌ (39) గత పదేళ్లుగా గ్రామంలో ఫర్టిలైజర్‌ వ్యాపారం చేస్తున్నాడు. అతడి తండ్రి తారాసింగ్‌ పోలీస్‌ శాఖలో ఏఎస్సైగా పని చేస్తున్నాడు. కుమారుడు ప్రేమ్‌కుమార్‌ వ్యాపారం చూసుకుంటున్నారు. అతడికి భార్య అమృత, కుమారుడు రాజా (12), కుమార్తెలు దీపిక (10), రోషిణి (8) ఉన్నారు. ఉన్నంత ఎంతో సంతోషంగా ఉంటున్న ప్రేమ్‌కుమార్‌ ఇటీవల ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌లు ఆడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసైన అతడు వ్యాపారంలోనూ తీవ్రంగా నష్టపోయాడు.

వ్యాపారం, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మొత్తం రూ. 70 లక్షల వరకు నష్టపోయాడు. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమ్‌కుమార్‌ శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత నుంచి అతడు ఎంత వెతికినా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. శనివారం కూడా వెతకగా సారంగాపూర్‌ మండలం చించోలి(బి) మైనార్టీ గురుకుల పాఠశాల సమీపంలో శవమై కనిపించాడు. ప్రేమ్‌కుమార్‌ కుడిచేతి మణికట్టుపై బ్లేడుతో కోసన గాయాలు ఉండటంతో.. ఇది ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా కూడా కనిపించింది. అనంతరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వ్యాపారి ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్..పురుగుల మందుతాగి సూసైడ్
వ్యాపారి ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్..పురుగుల మందుతాగి సూసైడ్
రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంత ఖర్చ అవుతుందో తెలుసా??
రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంత ఖర్చ అవుతుందో తెలుసా??
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన.. జీతభత్యాలు ఎంత..?
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన.. జీతభత్యాలు ఎంత..?
తెలుగులో ఒక్క సినిమా.. దెబ్బకు మాయం.. ఇప్పుడు ఇలా..
తెలుగులో ఒక్క సినిమా.. దెబ్బకు మాయం.. ఇప్పుడు ఇలా..
'మన శంకరవరప్రసాద్ గారు'ఫేక్ కలెక్షన్సా? అనిల్ రావిపూడి రియాక్షన్
'మన శంకరవరప్రసాద్ గారు'ఫేక్ కలెక్షన్సా? అనిల్ రావిపూడి రియాక్షన్
బంగ్లాదేశ్ తప్పుకుంది..పాకిస్థాన్ కూడా బ్యాగ్ సర్దేస్తోందా?
బంగ్లాదేశ్ తప్పుకుంది..పాకిస్థాన్ కూడా బ్యాగ్ సర్దేస్తోందా?
వెండిపై బడ్జెట్‌లో కీలక నిర్ణయం? ధర తగ్గుతుందా?
వెండిపై బడ్జెట్‌లో కీలక నిర్ణయం? ధర తగ్గుతుందా?
70% మహిళల్లో పశ్చాత్తాపం.. ప్రేమ కంటే ఆర్థిక భద్రతే ముఖ్యం
70% మహిళల్లో పశ్చాత్తాపం.. ప్రేమ కంటే ఆర్థిక భద్రతే ముఖ్యం
పోలీసులను ఆశ్రయించిన 'ది రాజాసాబ్' నిర్మాత ఎస్కేఎన్.. ఏమైందంటే?
పోలీసులను ఆశ్రయించిన 'ది రాజాసాబ్' నిర్మాత ఎస్కేఎన్.. ఏమైందంటే?
నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఎవరూ రావొద్దుః సీపీ సజ్జనార్
నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఎవరూ రావొద్దుః సీపీ సజ్జనార్