Telangana: కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్.. అభ్యర్థుల ఖరారు ఆయన చేతుల్లోనే..

Telangana Congress: రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలు ఈ తరహా దుష్ప్రచారాలు చేస్తూ తమ అవకాశాలను దెబ్బతీయాలని చూస్తుంటాయని, కానీ ఈ దుష్ప్రచారం సొంత పార్టీలోని కొందరు నేతలు చేయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసేవారు. ఇదంతా ఎలా ఉన్నా.. కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో గాంధీ కుటుంబం మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డిపై గట్టి నమ్మకాన్ని పెట్టుకుంది. గాంధీ కుటుంబం పట్ల ఆయన ప్రదర్శించే విధేయత.. ఆయనపై ఆ కుటుంబం విశ్వసనీయత వెరసి ఇప్పుడు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చోటు సంపాదించేలా చేసింది.

Telangana: కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్.. అభ్యర్థుల ఖరారు ఆయన చేతుల్లోనే..
Telangana Congress
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Sanjay Kasula

Updated on: Sep 05, 2023 | 7:14 AM

కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ప్రకటన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో కొత్త చర్చకు దారితీసింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే ఈ కమిటీలో టీపీసీసీ మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు కల్పించడమే ఈ చర్చకు కారణం. తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు అనంతరం పార్టీలో సీనియర్లు కొంత అసౌకర్యంగా మసలుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటివారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. ఆయన పార్టీ వీడి వెళ్లిపోతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరుతున్నారంటూ కథనాలు కూడా వెలువడ్డాయి.

ఇదంతా తనను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న దుష్ప్రచారంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతూ వచ్చారు. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలు ఈ తరహా దుష్ప్రచారాలు చేస్తూ తమ అవకాశాలను దెబ్బతీయాలని చూస్తుంటాయని, కానీ ఈ దుష్ప్రచారం సొంత పార్టీలోని కొందరు నేతలు చేయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసేవారు. ఇదంతా ఎలా ఉన్నా.. కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో గాంధీ కుటుంబం మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డిపై గట్టి నమ్మకాన్ని పెట్టుకుంది. గాంధీ కుటుంబం పట్ల ఆయన ప్రదర్శించే విధేయత.. ఆయనపై ఆ కుటుంబం విశ్వసనీయత వెరసి ఇప్పుడు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చోటు సంపాదించేలా చేసింది.

మొత్తం 16 మందితో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకారం కమిటీలో ఉన్న నేతలు వీరే..

కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ..

  1. మల్లికార్జున్ ఖర్గే
  2. సోనియా గాంధీ
  3. రాహుల్ గాంధీ
  4. అంబికా సోని
  5. అధిర్ రంజన్ చౌదరి
  6. సల్మాన్ ఖుర్షీద్
  7. మధుసూదన్ మిస్త్రీ
  8. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
  9. టీఎస్ సింగ్ దేవ్
  10. కేజే జియోగ్రే
  11. ప్రీతమ్ సింగ్
  12. మహ్మద్ జావేద్
  13. అమీ యాజ్ఞిక్
  14. పిఎల్ పునియా
  15. ఓంకార్ మార్కం
  16. కేసీ వేణుగోపాల్

మూడు దశాబ్దాల సేవకు గుర్తింపు

ఓటమి ఎరుగని రాజకీయ నాయకుడిగా పరిచయం ఉన్న ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్వాశ్రమంలో ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్‌జెట్ పైలట్ అన్న విషయం కూడా చాలా మందికి తెలుసు. యుద్ధ విమానాల పైలట్‌గా భారత్-చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించిన ఆయన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణం అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి భవన్‌లో ఉన్నతాధికారిగా సేవలు అందించారు. అదే సమయంలో రాజీవ్ గాంధీతో ఏర్పడ్డ పరిచయం ఆయన్ను రాజకీయాల వైపు ఆకర్షితులను చేసింది. 1994లో భారతీయ వాయుసేనకు పదవీ విరమణ ప్రకటించి కాంగ్రెస్‌లో చేరారు. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా గెలుపొంది రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సుదీర్ఘ సమయం పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అదే సమయంలో 2018 అసెంబ్లీ ఎన్నికలను కూడా ఎదుర్కొన్నారు. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పగ్గాలు అప్పగించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. అయితే రేవంత్ రెడ్డికి ఆయనకు మధ్య నెలకొన్న విబేధాలు అనేక సందర్భాల్లో బహిర్గతమవుతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఈ మధ్యనే ఉత్తమ్‌ను రాష్ట్రంలో స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడిగా నియమించింది. తాజాగా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చోటివ్వడం ద్వారా దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లను ఖరారు చేసే కీలక కమిటీలో పాత్రధారిని చేసింది. తెలంగాణ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కోసం అభ్యర్థుల వడపోత, తర్వాత ఖరారు చేసే విషయంలో ఉత్తమ్ ఇప్పుడు కీలకంగా వ్యవహరించనున్నారు.

మూడు దశాబ్దాల సేవకు గుర్తింపుగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ బాధ్యత దక్కడం ఒకెత్తయితే.. మూడు దశాబ్దాల్లో తొలిసారిగా తెలుగు నేతకు ఎలక్షన్ కమిటీలో చోటు దక్కడం మరో విశేషం. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)తో పాటు జాతీయ కార్యవర్గంలో కార్యదర్శులుగా అడపా దడపా తెలుగు నేతలకు చోటు దొరికినప్పటికీ ఎలక్షన్ కమిటీలో మాత్రం అవకాశం లభించలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు దక్కడంపై తెలంగాణ పీసీసీలో ఒక వర్గం నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి
శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు
రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు
ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు
ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు
రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త
రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త
నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?
నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?
ఫ్రెష్ కల్లు.. పండగ చేసుకుంటున్న రామచిలుకలు
ఫ్రెష్ కల్లు.. పండగ చేసుకుంటున్న రామచిలుకలు
కొత్త ఏడాదిలో కొత్త కాంబోస్.. టాలీవుడ్ ఫ్యాన్స్‎కి పండగే..
కొత్త ఏడాదిలో కొత్త కాంబోస్.. టాలీవుడ్ ఫ్యాన్స్‎కి పండగే..
ఇలాంటి ఫుడ్స్‌ తింటే త్వరగా ముసలివాళ్లయిపోతారు జాగ్రత్త..! వెంటనే
ఇలాంటి ఫుడ్స్‌ తింటే త్వరగా ముసలివాళ్లయిపోతారు జాగ్రత్త..! వెంటనే
సిటీలో అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్
సిటీలో అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..