AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీజేపీలో బూర నర్సయ్య గౌడ్ చేరికకు ముహుర్తం ఖరారు.. మాజీ ఎంపీని కలిసిన బండి సంజయ్..

టీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంపై క్లారిటీ ఇచ్చారు. ఈనెల 19వ తేదీన తాను కమలం పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 17వ తేదీ సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బూర నర్సయ్య గౌడ్..

Telangana: బీజేపీలో బూర నర్సయ్య గౌడ్ చేరికకు ముహుర్తం ఖరారు.. మాజీ ఎంపీని కలిసిన బండి సంజయ్..
Bandisanjay Meet Boora Narsaiah Goud
Amarnadh Daneti
|

Updated on: Oct 17, 2022 | 3:37 PM

Share

టీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంపై క్లారిటీ ఇచ్చారు. ఈనెల 19వ తేదీన తాను కమలం పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 17వ తేదీ సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బూర నర్సయ్య గౌడ్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ను ఆలింగనం చేసుకున్నారు బూర నర్సయ్య గౌడ్, అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్, తెలంగాణ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రుల సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ లో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. ప్రజా సమస్యలను వివరించడానికి కేసీఆర్ కనీసం అపాయిట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీలో చేరుతున్నానని బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్ ను కలవటం‌ టీఆర్ఎస్ నేతలకు ఒక ఉద్యమంలా మారిందని ఎద్దెవా చేశారు.

భువనగిరి పార్లమెంట్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందన్నారు. పార్టీలకు అతీతంగా మోదీ ప్రభుత్వం.. అభివృద్ధికి సహకరించిందన్నారు. తన రాజకీయ జీవితం కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీలో చేరుతున్నానని ఉద్ఘాటించారు. ఫైర్ బ్రాండ్ బండి సంజయ్, నడ్డా, అమిత్ షాలు ఆహ్వానం మేరకు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ నినాదం తనకు నచ్చిందన్నారు బూర నర్సయ్య గౌడ్. ఉద్యమకారులున్న బీజేపీ చేరడం.‌. ఘర్ వాపసీని తలపిస్తోందన్నారు.

నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ వేదిక: బండి సంజయ్

బూర నర్సయ్య గౌడ్ తో సమావేశం అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారితే.. నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదికైందన్నారు. స్వలాభం కోసం కాకుండా.. రాష్ట్ర భవిష్యత్ కోసమే బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ఆయన నిజాయితీకి మారు పేరని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బూర నర్సయ్య గౌడ్ వంటి నాయకులు కేసీఆర్ ను కలిసే పరిస్థితి లేదన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ కు బుద్ది చెప్పటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ కు కేంద్రం ఇచ్చిన నిధులపై ఎన్నికల సమయంలోనే గ్రామగ్రామానికి వెళ్లి స్పష్టత ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కేసీఆర్ ఇవ్వటం‌ లేదని బండి సంజయ్ విమర్శించారు. ఫాంహౌజ్ నుండి కేసీఆర్ ను ఇందిరా పార్క్ కు తీసుకొచ్చిన ఘనత బీజేపీదేనని తెలిపారు. భారత రాష్ట్ర సమితి అధినేతనని చెప్పుకున్న కేసీఆర్ ను మునుగోడు ఎన్నికలో ఒక గ్రామానికే పరిమితం చేసిన ఘనత బీజేపీదేనని చెప్పారు బండి సంజయ్. దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..