కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ సీఎం కేసీఆర్.. ఏం చెప్పబోతున్నారు..?
కాళేశ్వరం కమిషన్ విచారణల క్లైమాక్స్‌కు చేరుకుంది. మొత్తం వ్యవహారంలో చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించనుంది కమిషన్. బుధవారం(జూన్ 11) ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని గతంలోనే ఆదేశాలందాయి. 5వ తేదీకి బదులు 11వ తేదీన విచారణకు కేసీఆర్ హాజరు అవుతానంటూ లేఖ రాశారు కేసీఆర్. కమిషన్‌కు సమాచారం ఇవ్వడంతో కేసీఆర్ విజ్ఞప్తిని కాళేశ్వరం కమిషన్ అంగీకరించింది.

కాళేశ్వరం కమిషన్ విచారణల క్లైమాక్స్‌కు చేరుకుంది. మొత్తం వ్యవహారంలో చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించనుంది కమిషన్. బుధవారం(జూన్ 11) ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని గతంలోనే ఆదేశాలందాయి. 5వ తేదీకి బదులు 11వ తేదీన విచారణకు కేసీఆర్ హాజరు అవుతానంటూ లేఖ రాశారు కేసీఆర్. కమిషన్‌కు సమాచారం ఇవ్వడంతో కేసీఆర్ విజ్ఞప్తిని కాళేశ్వరం కమిషన్ అంగీకరించింది.
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుపై మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై 11వ తేదీన హాజరవుతానని కాళేశ్వరం కమిషన్‌కు కేసీఆర్ సమాచారం అందజేశారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని అంగీకరించిన కాళేశ్వరం కమిషన్ విచారణ తేదీని 11వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఇప్పటివరకు 17 మందిని విచారించిన కమిషన్ తదుపరి కేసీఆర్‌ను విచారణ బుధవారం చేయనుంది. రాజకీయ ప్రముఖులుగా అప్పటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఈటెల రాజేందర్ ,హరీష్ రావును ఆర్థిక, టెక్నికల్ అంశాలపై విచారించింది.
ఇప్పుడు కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించనుంది కాళేశ్వరం కమిషన్. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇవ్వాల్సిన సమాధానంపై కేసీఆర్ సుధీర్ఘ కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవినీతిని బయట పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు , ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఈటెల రాజేందర్‌లను విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ ఇటీవలే వారికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరయ్యారు.
కమిషన్ చైర్మన్ గా ఉన్న జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటివరకు చేసిన విచారణకు సంబంధించి అనుమానాలను, ప్రశ్నలను కేసీఆర్‌కు సంధించనున్నారు. ఇప్పటివరకు విచారణ ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తు అని పొలిటికల్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. కాళేశ్వరం అంతా తానీ అను చాలాసార్లు కేసీఆర్ చెప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా పదేపదే కాళేశ్వరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రధానంగా కేసీఆర్‌కు మూడు ప్రశ్నలు వేయనుంది కమిషన్.
1. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అప్పుడు సీఎంగా మీకు ప్రాథమికంగా వచ్చిన సమాచారం ఏంటి?
2. బ్యారేజీ కుంగిపోయిందన్న విషయం తెలియగానే అప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి?
3. బ్యారేజీ కుంగుబాటు తర్వాత ఎందుకని అక్కడికి ఎవరిని వెళ్లనివ్వకుండా రహస్యంగా ఉంచారు?
4. ఈ ప్రశ్నలతో పాటు కాళేశ్వరంలో ప్రాజెక్టు రీ డిజైనింగ్ సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఏంటి?
5. అప్పటి కేబినెట్‌లో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపిస్తున్నట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదా? ఉంటే దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా?
ఇలా కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక కీలక ప్రశ్నలు అడగనున్నారు కమిషన్ చీఫ్ పీసీ ఘోష్.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా విచారణను ఎదుర్కోవడానికి సిద్ధమవుతూనే.. దీన్ని బల ప్రదర్శనకు వేదికగా వాడుకుంటుంది. బుధవారం ఉదయం 9 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరి 11 గంటలకి బీఆర్‌కే భవన్‌లో ఉన్న కాళేశ్వరం కమిషన్ కార్యాలయానికి చేరుకుంటారు. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు అంతా ఇక్కడికి రానున్నారు. వేలాది మందితో బీఆర్‌కే భవన్ చుట్టుపక్కల ప్రాంతం నిండిపోయేలా ప్లాన్ చేసింది గులాబీ పార్టీ. జన సమీకరణతో పాటు కేసీఆర్ వెంట కమిషన్ కార్యాలయంలోకి కేటీఆర్, హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పిల్లలు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు హరీష్ రావు విచారణ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ముందున్న రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ విచారణ సందర్భంగా జీహెచ్ఎంసీ నుంచి సచివాలయం రోడ్డు వరకు పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఇదిలావుంటే, ఇప్పటికే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ 200మందికి పైగా విచారించి ఇప్పటికే 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది. గత ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలలో కొనసాగిన మాజీ సీఎస్.సోమేష్‌కుమార్, స్మిత సబర్వాల్, రజత్‌కుమార్ వంటి వారిని బహిరంగ విచారణకు పిలిచింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాళేశ్వరంగా రూపాంతరం చెందడం మొదలు, ప్రాజెక్టు డిజైన్‌లు, అనుమతులు, నిధులకు సంబంధించిన కీలక సమాచారాన్ని రికార్డు చేసింది. ముఖ్యంగా ప్రాజెక్టు వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచడంపై ఆరా తీసింది. నిర్మాణం పూర్తి కాకుండానే బకాయిల చెల్లింపుపై కూడా కూపీలాగింది. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణతో కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకం పూర్తి కానుంది. మొత్తంగా కాళేశ్వరం విచారణ ఎపిసోడ్‌లో బుధవారం కేసీఆర్ ఎంక్వయిరీ బిగ్ డే గా మారనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..