లిక్కర్ సిండికేట్ దగ్గర మామూళ్లు వసూళ్లు చేస్తూ అండంగా దొరికిపోయిన ఎమ్మెల్యే సామేల్..!
లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఎమ్మెల్యే కనిపించడం లేదు. కానీ ఎమ్మెల్యే ఇంట్లో రికార్డ్ చేసిన వీడియో అది. ‘‘ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా.. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. ప్రతీ రోజు లక్ష రూపాయలు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదు. ఒక్కో రోజు కారులో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు ఉండట్లేదు’’ అనేలా ఆ వీడియోలో వాయిస్ ఉంది.
లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఎమ్మెల్యే కనిపించడం లేదు. కానీ ఎమ్మెల్యే ఇంట్లో రికార్డ్ చేసిన వీడియో అది. ‘‘ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా.. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. ప్రతీ రోజు లక్ష రూపాయలు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదు. ఒక్కో రోజు కారులో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు ఉండట్లేదు’’ అనేలా ఆ వీడియోలో వాయిస్ ఉంది. ‘సహకరిస్తే ఓకే.. మాట వినకపోతే సంగతి చూస్తా’ అంటూ అందులో ఆడియో ఉంది. ఇది మందుల సామేల్ ఆడియో అనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే మందుల సామేల్ ఖండించారు. చిల్లర దందాలకు పాల్పడే వ్యక్తిని తాను కాదన్నారు. తనపై కొందరు కుట్రలు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. వీడియో తీసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి

