Himayat Sagar: మూసీ పరీవాహక ప్రాంతాలకు హెచ్చరిక.. హిమాయత్ సాగర్ జలాశయానికి పోటెత్తుతున్న వరద.. గేట్లు ఎత్తేందుకు సిద్ధం..!
భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. భారీగా చేరిన వరద నీరు చేరింది. నీటిమట్టం 1762 అడుగులకు చేరింది.
Flood Alert for Musi River: భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. భారీగా చేరిన వరద నీరు చేరింది. నీటిమట్టం 1762 అడుగులకు చేరింది. అటు మూసీ నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని హిమాయత్ సాగర్‌కు వరద ప్రవాహం పోటెత్తుతోంది. పెద్దఎత్తున నీరు వచ్చిచేరుతుండటంతో జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ హిమాయత్ సాగర్ కి భారీగా వరద నీరు చేరింది. ఆమ్లా పూర్ వాగు నుంచి భారీ వర్షం పడడంతో ఒక్కసారిగా వరద నీరు చేరుకోవడంతో రాజేంద్రనగర్ పోలీసులు సాగర్‌ని పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా హిమాయత్ సాగర్ కి రావద్దని లోతట్టు ప్రాంత ప్రజలందరికీ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హిమాయత్‌సాగర్ నిండుకుండలా మారడంతో 4 గేట్లు ఎత్తి వేశారు. దిగువన మూసీ నదిలోకి 2,752 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులు కాగా… ప్రస్తుతం 1762 అడుగుల కు చేరింది. హిమాయత్ సాగర్ లోకి వస్తున్న 1388 క్యూసెక్కుల ప్రాజెక్ట్‌లోకి వస్తోంది. ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా… ప్రస్తుతం 1784.60 అడుగులకు చేరింది.
మూసి నదీ పరివాహక ప్రాంతాలైన కిస్మత్ పూర్, బండ్లగూడ, హైదర్ గూడా, లంగర్ హౌస్, కార్వాన్ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు. పదేళ్ల తర్వాత హిమాయత్ సాగర్ నిండింది. ఈ జలాశయం నిండుగా ఉండటంతో హైదరాబాద్‌వాసుల తాగునీటికి ఇక ఇబ్బందులు ఉండవు. మరోవైపు – రెండు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి హుస్సేన్‌సాగర్ నిండిపోయింది. దీంతో సాగర్‌లోని నీటిని అధికారులు గేట్ల ద్వారా బయటకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Read Also… Cloudburst: పోటెత్తిన వరదలు.. కుప్పకూలిన ఇళ్లు.. ముగ్గురు మృతి, నలుగురు గల్లంతు..