AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పిడుగుల బీభత్సం.. నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలో ఐదుగురు బలి..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పొట్టకూటి కోసం వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, రైతు కూలీలు పిడుగుపాటుకు పిట్టల్లా రాలిపోతున్నారు.

Telangana: పిడుగుల బీభత్సం.. నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలో ఐదుగురు బలి..!
Thunderstorm
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Oct 06, 2024 | 5:58 PM

Share

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పొట్టకూటి కోసం వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, రైతు కూలీలు పిడుగుపాటుకు పిట్టల్లా రాలిపోతున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు వేరువేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయాయి. తాజా ఘటనలో ఓ విద్యార్థినితో సహా యువరైతు మృతి చెందారు.

గత వారం రోజుల నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగుల బీభత్సం సృష్టిస్తున్నాయి.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అమాయకుల ఆయువు మింగేస్తున్నాయి. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో పనులు చేసుకుంటూ పిడుగుపాటుకు బలయ్యారు. గురువారం(అక్టోబర్ 3) సాయంత్రం పిడుగుపాటుకు గురై ఆత్మకూరు మండలం చౌవులపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళా రైతులు మృతి చెందారు. పత్తి చేనులో చేస్తుండగా పిడుగుపడి రామ, నిర్మల అనే ఇద్దరు అత్తా కోడళ్ళుగా అక్కడికక్కడే మృతి చెందారు. అదే రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో పిడుగుపాటుతో లక్ష్మి (45) అనే మహిళా రైతు మృతి. చెందింది.

ఇక, తాజాగా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. మృతులు శ్రావణి అనే ఇంటర్ విద్యార్థిని తోపాటు, కూకట్ల రాజు అనే యువ రైతుగా గుర్తించారు. వారి వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న పశువుల కొట్టం కిందకు వెళ్తుండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనలో మృత్యువాత పడ్డ ఇద్దరూ అవివాహితులే. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తల్లులూ డైపర్లు వాడే ముందు ఈ తప్పు అస్సలు చేయకండి
తల్లులూ డైపర్లు వాడే ముందు ఈ తప్పు అస్సలు చేయకండి
వయస్సు పెరిగితే తండ్రి కావడం కష్టమా? సైన్స్ ఏమి చెబుతోంది?
వయస్సు పెరిగితే తండ్రి కావడం కష్టమా? సైన్స్ ఏమి చెబుతోంది?
మహీంద్రా నుంచి కొత్త థార్ విడుదల..పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌..ధర తక్కువే
మహీంద్రా నుంచి కొత్త థార్ విడుదల..పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌..ధర తక్కువే
ఇంటర్ అర్హతతో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఇంటర్ అర్హతతో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఛాయ్ చేతికి ఇవ్వలేదని దారుణం..!
ఛాయ్ చేతికి ఇవ్వలేదని దారుణం..!
ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్న పెంగ్విన్ వీడియో.. దాని వెనుక ఉన్న
ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్న పెంగ్విన్ వీడియో.. దాని వెనుక ఉన్న
ఆ సినిమా ఆడదని దిల్ రాజుకు చెప్పిన భార్య.. కట్ చేస్తే..
ఆ సినిమా ఆడదని దిల్ రాజుకు చెప్పిన భార్య.. కట్ చేస్తే..
నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు..
నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు..
ఎంతకు తెగించార్రా.. రీల్స్ పిచ్చితో ప్రాణాలు తీస్తారా.. వందే భారత
ఎంతకు తెగించార్రా.. రీల్స్ పిచ్చితో ప్రాణాలు తీస్తారా.. వందే భారత
టెన్త్‌ అర్హతతో రైల్వేలో 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో రైల్వేలో 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌