AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahammai Devi: చుట్టూ నీరు.. ప్రకృతి రమణీయత.. రారమ్మని పిలిచే.. మహిమాన్విత మహమ్మయి‌దేవి ఆలయం..!

మహమ్మయి‌దేవి అవతారాన్నే మొదటి అవతారం చెబుతుంటారు.. ఈ అవతారం ‌తరువాతనే ఈ అమ్మవారు వేరే అవతారాలతో కొలువై ఉన్నారంటారు. తక్కువగా ఉండే‌ స్వయంభు అలయాలు ఎలగందుల గ్రామంలో ఉండడం అదృష్టం గా భావిస్తున్నారు స్థానికులు

Mahammai Devi: చుట్టూ నీరు.. ప్రకృతి రమణీయత.. రారమ్మని పిలిచే.. మహిమాన్విత మహమ్మయి‌దేవి ఆలయం..!
Mahammai Devi Temple In Karimnagar
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 06, 2024 | 7:29 PM

Share

మహమ్మయి‌దేవి అవతారాన్నే మొదటి అవతారం చెబుతుంటారు.. ఈ అవతారం ‌తరువాతనే ఈ అమ్మవారు వేరే అవతారాలతో కొలువై ఉన్నారంటారు. తక్కువగా ఉండే‌ స్వయంభు అలయాలు ఎలగందుల గ్రామంలో ఉండడం అదృష్టం గా భావిస్తున్నారు స్థానికులు. ఈ మహమ్మాయి దేవి ఆలయాన్ని కాళీకాంబగా పిలుస్తున్నారు. స్వయంభుగా‌ వెలిసిన ఈ అమ్మవారిపై స్పెషల్ స్టోరీ.

కరీంనగర్ జిల్లా కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో పక్కనే ఎలగందుల ఖిల్లా.. చుట్టూ నీరు.. ప్రకృతి.. రారమ్మని పిలుస్తుంది.. ఎలగందుల ఖిల్లాని ఆధారంగా చేసుకుని కాకతీయులు పాలన కొనసాగించారు. కాకతీయులు ఎక్కడ పాలన కొనసాగించిన అక్కడ ఆధ్యాత్మిక వెల్లువిరుస్తుంది. ఈ క్రమంలోనే అరు వందల సంవత్సరాలకి పూర్వమే ఈ అలయం వెలసినట్లు పలు‌ అధారాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికి ఈ‌ అలయం చెక్కు చెదరలేదు.

స్వయంభుగా వెలిసిన అమ్మవారు మహమ్మాయి దేవి అవతారంగా దర్శనం‌ ఇస్తున్నారు. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతున్నాయి. అమ్మవారికి అద్భుతమైన శక్తి‌ ఉండడం ఇక్కడ వివిధ రూపాలలో దర్శనం ‌ఇస్తుందని భక్తులు ప్రచారం చేస్తున్నారు. గతంలో అమ్మవారికి హారతి‌ ఇస్తున్న సమయంలో ఆ జ్యోతి మహిషాసుర మర్ధినిగా అకారంలో దర్శనం ఇచ్చిందట. అ దృశ్యం సెల్ ఫోన్ లో‌ రికార్డు అయ్యింది…ఇప్పటికీ ఆ దృశ్యం తో‌ ఉన్న అమ్మవారి చిత్రపటాలను భక్తులకి ఇస్తున్నారు.

ఈ అమ్మవారి అలయానికి చరిత్రతో పాటు అద్భుతమైన శక్తి‌ ఉండడంతో భక్తుల సందడి కూడా పెరుగుతోంది. చాల మంది‌ భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తరువాత కోరిన కోరికలు తీరాయని నమ్ముతున్నారు. గతంలో భక్తుల సంఖ్య అంతంతా మాత్రంగానే ఉండేది. ఇప్పుడు భక్తుల‌ రద్దీ పెరిగింది. స్థానికులే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడ అమ్మవారి దర్శనం కోసం క్యూ కడుతున్నారు.

దేవి నవరాత్రి‌ ఉత్సవాలు ఈ స్వయంభు ఆలయంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మాలను స్వీకరించిన భక్తులు ఇక్కడ ప్రత్యేక‌ పూజలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారి వివిధ రూపాలలో దర్శనం ఇస్తున్నారు. ఈ‌‌ ఉత్సవాల‌ సందర్భంగా భక్తుల సంఖ్య కూడ పెరిగిపోయింది. అత్యంత‌ అరుదుగా‌ ఉండే‌ స్వయంభు అలయాలు ఈ‌గ్రామంలో అమ్మవారు ‌స్వయంభుగా వెలవడంతో స్థానికులు భక్తిభావంతో పరవశం పొందుతున్నారు. ప్రకృతి ‌మధ్యలో అమ్మవారుని చూడడానికి రెండు‌కండ్లు కూడా సరిపోవు. ఓ వైపు అమ్మవారి శక్తి, మరోవైపు ప్రకృతి కనువిందుతో ఈ ప్రాంతం‌ అంతా అధ్యాత్మిక నిండిపోయింది. ఎంతో చరిత్ర కలిగిన స్వయంభుగా‌ వెలిసిన అమ్మవారిని దర్శించుకోవాలంటే ఒకసారి ఎలగందుల వెళ్ళాల్సిందే..!

అమ్మవారి స్వయంభు అలయాన్ని‌ దర్శించుకోవడం ఎంతో‌ అదృష్టం గా భావిస్తున్నామని భక్తులు‌ చెబుతున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతున్నాయని నమ్ముతున్నారు. ఇలాంటి ప్రాచీన అలయాన్ని ఎక్కడ కూడ చూడలేదని చెబుతున్నారు. కాకతీయుల కాలంలోనే ఇక్కడ అమ్మవారు వెలిసారని పురోహితులు ‌చెబుతున్నారు. ఈ‌ అమ్మవారి ఆలయంలో ఎన్నో‌ అద్భుత శక్తులు బయటికి వచ్చాయని అంటున్నారు. నవరాత్రి‌ ఉత్సవాల‌ సందర్భంగా ‌అమ్మవారని‌‌ దర్శించుకుంటే అంత‌ శుభం జరుగుతుందని చెబుతున్నారు.

వీడియో చూడండి…

మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..