AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamanpur Varahaswamy Temple: మహర్షి కోరిక మేరకు వెలిసిన కమాన్ పూర్ వరాహ స్వామి గురించి తెలుసా..

లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు పది అవతారాలు ఎత్తారని హిందువుల నమ్మకం. ఈ దశవతారాల్లో వరాహ అవతారం ప్రసిద్దమైనది .మన తెలుగు రాష్ట్రాల్లో ఆది వరాహ స్వామి దేవాలయాలు చాలా అరదుగా ఉన్నయి. చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగినవి ..ఒకటి తిరుమల కాగా,ఇంకోటి కమానపూర్. ఈరోజు ఆ ఆలయ విశిష్టిత గురించి తెలుసుకుందాం..!  

Prudvi Battula
|

Updated on: Oct 06, 2024 | 8:00 PM

Share
దశావతారాలలో మూడవ అవతారం వరాహావతారం ఈ .వరాహ అవతారం లో జల ప్రళయం లో చిక్కుకున్న ఈ భూమండలాన్ని తన కోరల మీద అదిదేవుడు రక్షించాడని పురాణాలూ చెబుతున్నాయి. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.

1 / 5
కలియుగ ప్రారంభంలో శ్రీ వారు లక్ష్మి దేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకు అశ్రయమిచ్చారని ఓ పురాణం కథనం. అందుకు ప్రతిగా తిరుమలను సందర్శించే భక్తులు తొలుత వరాహస్వామి ని దర్సించాకే తనను దర్శిస్తారని శ్రీనివాసుడు వరమిచ్చారట.

2 / 5
ఇక వరాహస్వామి పెద్దపల్లి జిల్లా కమానపూర్ గ్రామంలో ఒక బండ రాయి పైన చిన్న ఎలుక ఆకారం లో స్వామి వెలిసాడు . అంతేకాదు ఇక్కడ వరాహస్వామి నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్ళు కూడా పక్కనే ఉన్న మరో బండ పైన దర్శనం ఇస్తాయి.

3 / 5
స్వామివారిని దర్శించుకోవాలంటే కరీంనగర్ నుంచి గోదావరి ఖనికి కమాన్ పూర్ మీదుగా వెళ్లే ప్రత్యేక బస్ లు ఉంటాయి . కరీంనగర్ నుండి కమానపూర్ మీదుగా పెద్దపల్లి బస్ లు వెళ్తాయి . ఇక ఈ దేవాలయానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ పెద్ద పల్లి . అక్కడి నుండి ఈ దేవాలయనికి ఆటో లు ,బస్సుల్లో కూడా చేరుకోవచ్చు.

4 / 5
 స్థల పురాణం ప్రకారం సుమారు 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి తపస్సు చేయగా ఆయన కలలో స్వామి వారు కనిపించి ఏమి కావాలని కోరగా అప్పుడు మహర్షి ఇక్కడే కొలువై ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని కోరారట. దీంతో స్వామి వారు ఒక బండరాయి లో వెలిసినట్లు శాసనాలు ద్వారా తెలుస్తోంది. ఇక్కడ స్వామి వారు బయటే ఉంటారు. ఎలాంటి మందిరం కాని గోపురం కానీ ఉండదు.

5 / 5