బట్టల షాపులో భారీ అగ్ని ప్రమాదం
కరీంనగర్: జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఉన్న ఓ బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దుకాణంలోని బట్టలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో కాంప్లెక్స్ లోని స్థానికులు మంటలను ఆర్పేందకు యత్నించారు. భారీగా గాలి వీయడంతో కాంప్లెక్స్‌లోని ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దీంతో అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని ఫైర్ సిబ్బంది […]
కరీంనగర్: జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఉన్న ఓ బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దుకాణంలోని బట్టలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో కాంప్లెక్స్ లోని స్థానికులు మంటలను ఆర్పేందకు యత్నించారు. భారీగా గాలి వీయడంతో కాంప్లెక్స్‌లోని ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దీంతో అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లిందని బట్టల షాపు యజమాని వెల్లడించారు.