‘ఇకపై బీసీ విద్యార్ధులకూ పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుంది..’: మంత్రి గంగుల

తెలంగాణ రాష్ట్ర సర్కార్ బీసీ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఫీజు...

'ఇకపై బీసీ విద్యార్ధులకూ పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుంది..': మంత్రి గంగుల
Minister Gangula Kamalakar
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 26, 2023 | 1:34 PM

హైదరాబాద్‌, జులై 26: రాష్ట్రంలోని బీసీ విద్యార్ధులకు తెలంగాణ  సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంతోపాటు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన రాష్ట్ర బీసీ విద్యార్ధులందరికీ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అమలు అవుతుందని మంత్రి తెలిపారు.

కాగా గతంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు అవకాశం ఉండేది. ఈ విద్యా సంవత్సరం నుంచి బీసీ విద్యార్థులకూ వర్తింపజేస్తామని, ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని మంత్రి గంగుల స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.150 కోట్ల భారం పడనుంది. ఇప్పటి వరకూ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ అందిస్తు్న్న రాష్ట్ర ప్రభుత్వం ఇకపై రాష్ట్రంలోనూ ఫీజు రీయెంబర్స్‌మెంట్‌ చెల్లించనున్నట్లు చెప్పారు. దీంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజును చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి గంగుల తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?