AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురి ప్రేమ వివాహం.. తట్టుకోలేక తండ్రి ఏం చేశాడో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు.!

తండ్రి కూతుళ్ల బంధం అనేది ఒక ప్రత్యేకమైన బంధం. నవమాసాలు మోసి తనకు జన్మనిచ్చిన తల్లి కంటే.. తండ్రి అంటే కూతురికి ఆపేక్ష. తండ్రి-కూతుళ్లు ఫ్రెండ్స్ మాదిరిగా బాండింగ్ ఉంటుంది. తన కూతురు తనకు తెలియకుండా చేసిన ఓ పనికి ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా..? అయితే ఇరుగు పొరుగు జాలి చూపినా.. కన్న కూతురు ఏమాత్రం చలించలేదు.

కూతురి ప్రేమ వివాహం.. తట్టుకోలేక తండ్రి ఏం చేశాడో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు.!
Father Suicide
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Apr 13, 2025 | 11:18 AM

తండ్రి కూతుళ్ల బంధం అనేది ఒక ప్రత్యేకమైన బంధం. నవమాసాలు మోసి తనకు జన్మనిచ్చిన తల్లి కంటే.. తండ్రి అంటే కూతురికి ఆపేక్ష. తండ్రి-కూతుళ్లు ఫ్రెండ్స్ మాదిరిగా బాండింగ్ ఉంటుంది. తన కూతురు తనకు తెలియకుండా చేసిన ఓ పనికి ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా..?

నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన రెముడాల గట్టయ్య – సత్యమ్మ దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ గట్టయ్య కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచుతూ కూతురిని బిటెక్ సెకండియర్ చదివిస్తున్నాడు. తన గారాల పట్టి కూతురును బాగా చదివించి పెళ్లి చేయాలని గట్టయ్య భావించాడు. గత నెల మార్చి 8వ తేదీన ఇంటి నుండి వెళ్లిన కూతురు తిరిగి ఇంటికి రాలేదు. కూతురు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందాడు. తండ్రి గట్టయ్య చిట్యాల పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసిన మూడు రోజులకు యువతి నల్లగొండలోనే ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమైంది. చిట్యాలకు చెందిన దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని పోలీసులకు తెలిపింది. తన కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ యువతి కోరింది. పోలీసుల నుండి విషయం తెలుసుకున్న గట్టయ్య.. తన కూతురితో ఒకసారి మాట్లాడించాలంటూ పోలీసులను ప్రాధేయపడ్డాడు. తల్లిదండ్రులను కలవనని యువతీ స్టేట్‌మెంట్ ఇచ్చిందని.. గట్టయ్యకు స్థానిక పోలీసులు చెప్పారు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గట్టయ్య ఏప్రిల్ 10వ తేదీన ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన ఇరుగు పొరుగు ఆసుపత్రికి తరలించారు. అయితే గట్టయ్య చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచాడు. గట్టయ్య ఆత్మహత్య విషయాన్ని అతడి కుమార్తెకు ఫోన్‌లో చెప్పి చివరిచూపు కోసం రావాలని బంధువులు కోరారు. తాను రానని యువతి తెగేసి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

10thలో తక్కువ మార్కులొచ్చాయా? రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇలా..
10thలో తక్కువ మార్కులొచ్చాయా? రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇలా..
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఖాతా బదిలీ మరింత సులభం
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఖాతా బదిలీ మరింత సులభం
వంట గదిలో పాత్రలను ఏ దిశలో ఎలా పెట్టుకోవాలో తెలుసా..
వంట గదిలో పాత్రలను ఏ దిశలో ఎలా పెట్టుకోవాలో తెలుసా..
ఇప్పుడు ఆధార్‌, పాన్, రేషన్ కార్డు కాదు.. ఈ రెండు పత్రాలు మాత్రమే
ఇప్పుడు ఆధార్‌, పాన్, రేషన్ కార్డు కాదు.. ఈ రెండు పత్రాలు మాత్రమే
రెండేళ్లుగా పహల్గామ్‌లోనే ఉగ్రవాదులు! పాక్‌ నుంచి ఇండియాలోకి..
రెండేళ్లుగా పహల్గామ్‌లోనే ఉగ్రవాదులు! పాక్‌ నుంచి ఇండియాలోకి..
భగవద్గీత శ్లోకాలలో జీవిత రహస్యాలు..!
భగవద్గీత శ్లోకాలలో జీవిత రహస్యాలు..!
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే..
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే..
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన