Telangana: కూతురిని నిద్రలేపుదామని వెళ్లాడు.. దుప్పటి తీసి చూసి కంగుతిన్నాడు. పక్క గదిలో భార్యను చూసి!..
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి కూతురు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. కూతురు బెడ్‌పై గొంతు కోసి పండి ఉండగా..తల్లి ఇంట్లోని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Nalgonda: ఆయన రోజు మాదిరిగానే ఉద్యోగానికి వెళ్లాడు. సాయంత్రం విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే భార్యను పలిచాడు, చిన్న కూతురిని పిలిచాడు. కానీ ఎవరూ బటయకు రాలేదు. రూమ్‌లోకి వెళ్లి దుప్పటి కప్పుకుని పడుకున్న కూతురుని, ఆ పక్క గదిలో ఉన్న భార్యని చూసి షాక్ అయ్యాడు. అసలు ఆయన ఏం చూశాడు.. అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన గుర్రం సీతారాంరెడ్డి మిర్యాలగూడ పట్టణంలో నివాసం ఉంటూ ఓ ఆగ్రో కెమికల్స్, ఫర్టిలైజర్ సంస్థలో సేల్స్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సీతారాంరెడ్డి, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతరు పేరు వేదశ్రీ, చిన్న కూతరు పేరు వేద సాయిశ్రీ. ఎప్పటి లాగే ఆఫీస్ పని మీద హైదరాబాద్ హైదరాబాద్ వెళ్లిన సీతారాం రెడ్డి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడే నిద్ర లేచిన పెద్ద కుమార్తె గేట్ తీసి.. అమ్మా, చెల్లి నిద్రపోతున్నారని చెప్పింది. దీంతో సీతారాం రెడ్డి తన చిన్న కూతురు వేద సాయిశ్రీని నిద్ర లేపేందుకు దుప్పటి తొలగించాడు.. బెడ్‌పై గొంతు కోసి ఉన్న కూతురిని చూసి షాక్ అయ్యాడు. పక్కనే మరో గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది..దీంతో తలుపు పగలగొట్టి చూడగా భార్య రాజేశ్వరి ఉరేసుకుని ఉన్న స్థితిలో కనిపించింది. రక్తమడుగులో కుమార్తె, ఉరితాడుకు వేలాడుతూ ఉన్న భార్యను చూసిన సీతారాంరెడ్డి కంగుతిన్నాడు. భార్య, కూతరు మరణంతో కన్నీటిం పర్యంతమ్యాడు. వెంటనే తేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరీశీలించారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు. పోలీసులు రెండు మృతదేహాలను పరిశీలించారు. రాజేశ్వరి ఎడమచేతిపై కత్తి గాయాలు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. రాజేశ్వరి తన చిన్న కూతుర్ని హత్య చేసి, తాను ఆత్మహత్యకు పాల్పడిందా? లేదా ఎవరైనాహత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరి మృతితో ఆ ఇంట్లో విషాధ చాయలు నెలకొన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..