Telangana: ఇంత సిల్లీ ఫెల్లోవి ఎంట్రా బాబు.. చికెన్ తినలేదని కొడుకును చితకబాదాడు.. కట్ చేస్తే
అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నపిల్లల పట్లనే తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చికెన్ తినలేదని ఓ తండ్రి తన కుమారుడిని చితకబాదాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన తల్లి.. తన భర్తపైనే పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామానికి చెందిన లింగం శ్రీనివాస్, మహేశ్వరి దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు మురళి ఉన్నాడు. మురళికి కొద్ది రోజుల క్రితం కామెర్ల జ్వరం వచ్చింది. ఈ కారణంగా మురళి స్కూలుకు వెళ్లకుండా ఇంట్లో ఉంటున్నాడు. పనుల నిమిత్తం మూడు రోజుల క్రితం ఊరు వెళ్లిన మురళి తండ్రి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తల్లి మహేశ్వరి కూలి పనికి వెళ్లింది. శ్రీనివాస్ ఇంటికి వస్తూ చికెన్ తీసుకొచ్చాడు.
ఇంటివద్ద ఉన్న కుమారుడిని తాను తెచ్చిన చికెన్ తినాలని శ్రీనివాస్ బలవంతం చేశాడు. తినకపోవటంతో బెల్టుతో విచక్షణారహితంగా కన్న కొడుకును చితకబాదాడు. పని నుంచి ఇంటికి వచ్చిన మహేశ్వరి తన భర్త కుమారుడిని కొట్టిన విషయం తెలుసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళిన ఆమె, భర్త శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…