AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadagiri Gutta: యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చుతున్నారా..? అసలు రికార్డుల్లో ఏముంది..?

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా మారబోతుందా..? రేవంత్ రెడ్డి సర్కార్ పేరు మార్చే దిశగా కొత్త ఆలోచన చేస్తుందా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. యాదాద్రి పుణ్యక్షేత్రం పేరును యాదగిరి గుట్టగా మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని సమాచారం.

Yadagiri Gutta: యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చుతున్నారా..? అసలు రికార్డుల్లో ఏముంది..?
Yadagiri Gutta
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 03, 2024 | 11:15 AM

Share

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా మారబోతుందా..? రేవంత్ రెడ్డి సర్కార్ పేరు మార్చే దిశగా కొత్త ఆలోచన చేస్తుందా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. యాదాద్రి పుణ్యక్షేత్రం పేరును యాదగిరి గుట్టగా మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని సమాచారం.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయాన్ని 1,200 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వైటిడిఏ)ని కూడా ఏర్పాటు చేసింది. మాజీ సీఎం కేసీఆర్.. ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి జీయర్ స్వామి సూచనలు, సలహాలతో 2015లో ప్రధాన ఆలయ పుణ్య నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తికావడంతో 2022లో ఆలయ ఉద్ఘాటనతో భక్తులకు స్వామివారి దర్శనం భక్తులకు కలిగింది.

ప్రధాన ఆలయ పునర్నిర్మాణ సమయంలోనే అప్పటి ప్రభుత్వం యాదగిరిగుట్టగా ఉన్న పేరును యాదాద్రిగా మార్చాలని భావించింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ లేదు. ప్రభుత్వ, దేవదాయ శాఖ రికార్డుల్లో ఎక్కడా కూడా యాదాద్రి అనే పేరు లేదు. యాదగిరిగుట్ట దేవస్థానం అనే ఉంది. యాదగిరిగుట్ట దేవస్థానాన్ని యాదాద్రిగా పిలవాలని చిన్న జీయర్ స్వామి సూచించడంతో అప్పట్నుంచి ఆలయ పేరు యాదాద్రిగా భక్తులు పిలుస్తున్నారనే ప్రచారం ఉంది. దీనికి తోడు ఇదే పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాను కూడా ఏర్పాటు చేసింది.

మళ్లీ పాత పేరు..!

యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా పిలిచే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. త్వరలోనే యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుతుందని, ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పారు. గతంలో ఉన్న విధానాలను అమల్లోకి తీసుకువస్తామని, క్షేత్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు సీఎం నిర్ణయించారని తెలిపారు. కొండ పై డార్మిటరీ హాల్ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.

ఇదిలా ఉంటే జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఇదే విషయాన్ని చెప్పారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తామన్నారు. వందల ఏళ్లుగా ఉన్న యాదగిరి గుట్ట పేరును గత ప్రభుత్వం యాదాద్రిగా మార్చిందని అన్నారు. క్షేత్రానికి పూర్వ సంప్రదాయం చేకూర్చేలా ప్రయత్నిస్తామని అన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…