AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆపరేషన్ థియేటర్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్.. సంబరాలతో మురిసిన వైద్య సిబ్బంది

వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల పనితీరు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా ఉంది. రోజుకు 300ల మందికి పైగా వచ్చే తొర్రూరు ప్రభుత్వ దవాఖానలో పేషెంట్ల సేవ మరిచిన సిబ్బందంతా డాక్టర్ సాబ్ మెప్పుకోసం సారు వారి గానా బజానాలో మునిగి పోయారు.

Telangana: ఆపరేషన్ థియేటర్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్.. సంబరాలతో మురిసిన వైద్య సిబ్బంది
Deputy Dmho Birthday Celebrations
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Mar 03, 2024 | 10:39 AM

Share

పిల్లి గుడ్డిదైతే ఎలుక ఇల్లు పీకి పందిరేస్తుందన్నట్లుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వైద్యుల నిర్వాహకం. ఏకంగా ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ హాల్‌లో జన్మదిన వేడుకలు నిర్వహించి రోగులు నివ్వెరపోయేలా చేశారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల పనితీరు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా ఉంది. రోజుకు 300ల మందికి పైగా వచ్చే తొర్రూరు ప్రభుత్వ దవాఖానలో పేషెంట్ల సేవ మరిచిన సిబ్బందంతా డాక్టర్ సాబ్ మెప్పుకోసం సారు వారి గానా బజానాలో మునిగి పోయారు.

తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం రోగులతో రద్దీగా ఉంటుంది. ఇదే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్ఓ Dr మురళీధర్ రావు పుట్టినరోజు శనివారంసారు పై స్వామిభక్తిని చాటుకున్న సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రిలో సౌండ్ బాక్సులు పెట్టి అరుస్తూ సంబరాలు జరుపడం చర్చనేయంశంగా మారింది..

డ్యూటీ అవర్స్‌లో ఆపరేషన్ థియేటర్ హాల్‌లో ఈ వేడుకలు నిర్వహించారు వైద్య సిబ్బంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వేడుకలు జరిగాయి. డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. అయితే శనివారం మురళీధర్ పుట్టినరోజు. దీంతో ఆసుపత్రిలో సౌండ్ బాక్స్ లు పెట్టి బిర్యానీ వండించి అందరికీ విందు భోజనాలు పెట్టి సంబరాలు చేసుకున్నారు. రోగుల సేవలు పక్కన పెట్టి బిర్యానీతో ఆస్పత్రిలో విందు వినోద కార్యక్రమాలు నిర్వహించడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి మొత్తం దద్దరిల్లేలా సౌండ్ బాక్సులు పెట్టి ఇస్ ద లెజెండ్ అనే నినాదంతో డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్ కు జన్మదిన శుభాకాంక్షలు సిబ్బంది తెలిపడం విమర్శలకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇదే..

ఇలాంటి విందు వినోద కార్యక్రమాలపై ఉన్న శ్రద్ధ ఆసుపత్రికి వచ్చే రోగులపై చూపితే బాగుంటుందని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వేడుకలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా