Telangana: గాఢనిద్రలో ఉండగా కాటేసిన పాము.. తండ్రీ, కొడుకు మృతి.. అలా చేసి ఉంటే..
Kamareddy District News: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజంపేట మండలం మూడుమామిళ్ల తండాలో పాము కాటుతో తండ్రీకొడుకులు.. ఇద్దరూ మృతి చెందారు. రాత్రి కుటుంబమంతా గాఢనిద్ర నిద్రలో ఉండగా ఈ ఘటన జరిగింది.

Kamareddy District News: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజంపేట మండలం శేర్ శంకర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని మూడుమామిళ్ల తండాలో పాము కాటుతో తండ్రీకొడుకులు.. ఇద్దరూ మృతి చెందారు. రాత్రి కుటుంబమంతా గాఢనిద్ర నిద్రలో ఉండగా ఈ ఘటన జరిగింది. మూడుమామిళ్ల తండాలో శనివారం ఉదయం ఈ విషాద ఘటన జరిగిందని.. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముద్రిచ రవి (40), అతని కుమారుడు వినోద్ (12) శుక్రవారం రాత్రి నిద్రపోతున్నారు. ఈ సమయంలో పాము కొడుకు వినోద్ శరీరంపై నుంచి వెళ్లింది. ఈ సమయంలో గమనించిన వినోద్.. కేకలు వేశాడు. దీంతో అప్రమత్తమైన తండ్రి రవి.. పామును చంపేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో పాము బుసలు కొడుతూ రవిని కూడా కాటేసింది.
పాము కాటేసినప్పటికీ.. వారు ఏం కాదంటూ స్థానికంగా దొరికే ఆకు పసరు వేసుకుని ఉన్నారు. ఈ క్రమంలోనే వినోద్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు.. రవిని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి కూడా ప్రాణాలు విడిచాడు.
అయితే, పాము కరిచిన వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే ఇద్దరూ ప్రాణాలు దక్కేవని.. కానీ అశ్రద్ధ చేయడంతో తండ్రీకొడుకులిద్దరూ మరణించారని తండా వాసులు తెలిపారు. తండ్రికొడుకు ఇద్దరూ పాము కాటుతో మరణించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..