Lemon Price: అయ్యో.! భారీగా పడిపోయిన నిమ్మ రేటు.. ప్రజంట్ ఎంతంటే..?

నిమ్మకు నీరసం. అమ్మకం ధర పడిపోవడంతో నీరసపడ్డాడు నిమ్మ రైతు. మండే వేసవి.. నిమ్మ రైతుకు పంట పండించాల్సింది పోయి.. మంట పెడుతోంది. ఈ ఒక్క సీజన్‌లోనే దాదాపు పాతిక్కోట్లు నష్టపోయాడు నిమ్మ రైతు.

Lemon Price: అయ్యో.! భారీగా పడిపోయిన నిమ్మ రేటు.. ప్రజంట్ ఎంతంటే..?
Lemon Price
Follow us

|

Updated on: May 29, 2023 | 5:33 PM

తెలంగాణాలోనే నిమ్మ, బత్తాయి సాగుకు ఒరిజినల్ కేరాఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లానే. ఈసారి దాదాపు 13 వేల ఎకరాల్లో నిమ్మ తోటలు సాగు చేశారు రైతులు. రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్ల పాటు విక్రయాలు లేకపోయినా పెట్టుబడి పెట్టి నిమ్మ తోటలు సాగు చేశారు. ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర మాత్రం లేదు. అకాల వర్షాలకు 165 ఎకరాల్లో నిమ్మ పంట దెబ్బతింది.

గతంలో ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు కనీసం హైదరాబాద్‌ మార్కెట్‌క్కూడా ఎగుమతుల్లేవు. నిమ్మకాయలు కోసి నకిరేకల్‌లోని మార్కెట్‌లో రాత్రిపూట విక్రయించాల్సిన పరిస్థితి. ఇదే అదనుగా దళారులు రెచ్చిపోతున్నారు. కూలీల రేటు, రవాణా ఖర్చులు, వ్యాపారుల కమీషన్లు పోనూ మిగిలేది బూడిదే.

గత ఏప్రిల్‌, మే నెలల్లో కిలో 65 రూపాయలకు అమ్మేవాళ్లు. ఈ ఏడాది 15 రూపాయలకు పడిపోయింది. ధర తగ్గడంతో టన్ను నిమ్మ 1,500 రూపాయల చొప్పున తెగనమ్ముకుంటున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి పాతిక్కోట్లకు పైగా నష్టపోయాడు ఇక్కడి నిమ్మరైతు. తమకు ప్రభుత్వమే ఆదుకోవాలని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోెసం

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..