AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అంత మంచి రహదారి మాకొద్దు.. వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన అన్నదాతలు.. ఎక్కడో తెలుసా?

నేషనల్ హైవే 63 నిర్మాణంలో మార్పులను వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా బాదితులు‌ పెద్ద ఎత్తున రోడ్డెక్కుతున్నారు. పాత రహదారి నిర్మాణానికి పాతరేసి గ్రీన్ ఫీల్ట్ హైవే అంటూ కొత్త రూట్ మ్యాప్‌తో మా బ్రతుకులను రోడ్డు పాలు చేస్తున్నారంటూ ఆగ్రహిస్తూ రెండు మండలాల రైతులు ఆందోళన బాట పట్టారు.

Telangana: అంత మంచి రహదారి మాకొద్దు.. వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన అన్నదాతలు.. ఎక్కడో తెలుసా?
Farmers Protest
Naresh Gollana
| Edited By: |

Updated on: Mar 10, 2024 | 1:25 PM

Share

నేషనల్ హైవే 63 నిర్మాణంలో మార్పులను వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా బాదితులు‌ పెద్ద ఎత్తున రోడ్డెక్కుతున్నారు. పాత రహదారి నిర్మాణానికి పాతరేసి గ్రీన్ ఫీల్ట్ హైవే అంటూ కొత్త రూట్ మ్యాప్‌తో మా బ్రతుకులను రోడ్డు పాలు చేస్తున్నారంటూ ఆగ్రహిస్తూ రెండు మండలాల రైతులు ఆందోళన బాట పట్టారు. గ్రీన్ ఫీల్డ్ హైవే వద్దు.. పాత రహదారే ముద్దు అంటూ వరుస నిరసనలు , ధర్నాలు , ఆందోళనలు చేపడుతున్నారు.

గ్రీన్ ఫీల్ట్ రహదారంటూ పచ్చని పంటపొలాలను మింగేస్తున్న ఎన్ హెచ్ 63 రహదారి మాకు‌ వద్దే వద్దంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు 30 గ్రామాల ప్రజలు. పంట భూములు కోల్పోతున్నాం న్యాయం చేయాలంటూ వేడుకుంటూ రహదారి పై ధర్నాకు దిగారు ఎన్ హెచ్ 63 బాదిత రైతులు. మంచిర్యాల‌ జిల్లా లక్షేట్టిపేట మండలం సూరారం వద్ద పెద్ద ఎత్తున రోడ్డు పై బైటాయించి ఆందోళన చేపట్టారు. మా భూములను కాపాడండి, లేదంటూ మా ప్రాణాలు తీసి మా పంట భూములను తీసుకోడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మంచిర్యాల – జగిత్యాల జిల్లాల మధ్య నిర్మాణం కానున్న జగ్దల్ పూర్ టూ నిజామాబాద్ జాతీయ రహదారి 63 కథ మళ్లీ మొదటికొచ్చింది. గ్రీన్ ఫీల్డ్ హైవే కారణంగా వందల ఎకరాల పచ్చని పంటలు కోల్పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మంచిర్యాల జిల్లాల రైతులు రోడ్డెక్కారు. బడా వ్యాపారుల‌ కోసం రూట్ మార్చి రైతుల భూములను మింగేసేలా జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున‌ ఆందోళనకు దిగారు.

ప్యాకేజీ 4 లో భాగంగా ఆర్మూరు-మంచిర్యాల మధ్య జగిత్యాల‌ జిల్లా రాయపట్నం గోదావరి వంతెన నుండి మొదలై మంచిర్యాల జిల్లా ముల్కల వరకు 34 కి.మీ. మేర నిర్మాణం కానుంది. యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ పీల్డ్ హైవే కారణంగా 105 హెక్టార్ల పంట భూములను కోల్పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండలం సూరారం వద్ద రాస్తారోకో చేపట్టారు. వారం రోజులుగా వివిద రూపాల్లో అదికారులకు , ప్రజా ప్రతినిధులకు గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకున్న పాపన పోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మహా ధర్నా చేపట్టారు.

నిజామాబాద్ – జగిత్యాల – మంచిర్యాల జిల్లాల మద్య మూడేళ్ల క్రితం ప్రపోజ్ చేసిన గ్రీన్ ఫీల్డ్ హైవేకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ హైవే 63 లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా గద్దెరాగడి వరకు దీనిని నిర్మించేందుకు ఓకే చెప్పింది. 125 కిలోమీటర్ల పొడవైన ఈ ఫోర్ లేన్ కోసం మొదట రూ.2,591 కోట్లు కేటాయించగా, అంచనా వ్యయం మూడేళ్లలో అమాంతం పెరిగి రూ.3,850 కోట్లు ఖర్చు కు చేరింది. నాలుగు‌ ప్యాకేజీలు‌గా నిర్మాణం కానున‌్న ఈ రహదారి ప్యాకేజీ1లో భాగంగా ఆర్మూరు నుంచి మెట్‌పల్లి వరకు 35.9 కి.మీ.. ప్యాకేజీ2 లో మెట్‌పల్లి నుంచి జగిత్యాల వరకు 28.7 కి.మీ.. ప్యాకేజీ3 జగిత్యాల నుంచి రాయపట్నం వరకు 31.9 కి.మీల రహదారి సర్వే పూర్తయి నిర్మాణం కూడా కొనసాగుతోంది.

అసలు చిక్కల్లా ప్యాకేజీ4 లోని జగిత్యాల‌జిల్లా రాయపట్నం నుంచి మంచిర్యాల జిల్లా ముల్కల వరకు నిర్మాణం కానున్న 35.9 కి.మీ లోని వచ్చి‌పడింది. ఈ 35 కిమీల లో ఏకంగా 213 మంది రైతులకు చెందిన 105 హెక్టార్ల భూమిని ఎన్ హెచ్ 63 లో కనుమరుగు‌కానుంది. అయితే గతంలో ఇదే 35కిమీల లో 22 కిమీల రహదారిని బ్రౌన్ ఫీల్డ్ గా మారుస్తూ సర్వే నిర్వహించింది కేంద్రం. అయితే ఈ బ్రౌన్ పీల్డ్ రహదారితో లక్షేట్టిపేట మున్సిపాలిటీ ప్రమాదంలో పడనుంది. వ్యాపారులు రోడ్డెక్కడంతో సర్వే నిలిచిపోయింది. గల్లీ నుండి ఢిల్లీ వరకు బ్రౌన్ ఫీల్డ్ హైవే బాదితులు తమ వాయిస్ వినిపించడంతో రాత్రికి రాత్రే బ్రౌన్ ఫీల్డ్ రద్దైంది.

తాజాగా యాక్సెస్ గ్రీన్ ఫీల్డ్ హైవే అంటూ కేంద్ర కొత్త పేరుతో ఎన్ హెచ్ 63 ప్యాకేజీ 4 సర్వే కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పచ్చని పంట పొలాలు జాతీయ రహదారి పాపాన కోల్పొతున్నామంటూ రోడ్డెక్కారు 30 గ్రామాలకు చెందిన 210 మంది రైతులు. ఎల్లంపల్లి‌ ప్రాజెక్ట్ నిర్మాణంతో పదేళ్ల క్రితం పచ్చని‌పంట పొలాలను‌కోల్పోయామని.. హైవే పేరుతో మరొసారి బాదితులుగా మారుతున్నామని.. ప్రభుత్వం పట్టించుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఎన్ హెచ్ 63 గ్రీన్ ఫీల్డ్ హైవే బాదితులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…