AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంట్రా ఇది.. రైతుల దగ్గర పంట కొని చెక్కులు ఇచ్చాడు.. చివరకు ఏం జరిగిందంటే..

దాదాపు కోటి రూపాయలకు పైగా రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వకుండా పరారయ్యాడు కుభీర్ మహిళ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సంస్థ సీఈవో శ్రీనివాస్. ధాన్యం కొనుగోళ్లలో దళారులబారి నుంచి రైతులను రక్షించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు సైతం దళారులరీతిలో మోసాలకు తెగబడటంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు.

ఏంట్రా ఇది.. రైతుల దగ్గర పంట కొని చెక్కులు ఇచ్చాడు.. చివరకు ఏం జరిగిందంటే..
Adilabad Farmers Scam
Shaik Madar Saheb
|

Updated on: Jun 09, 2025 | 10:25 AM

Share

నిర్మల్ జిల్లాలో రైతులకు కుచ్చు టోపీ పెట్టిందో రైతు ఉత్పత్తిదారుల సంస్థ. రైతులనుంచి కొన్న మొక్కజొన్న ఉత్పత్తులకు డబ్బు చెల్లించకుండా ఎగనామం పెట్టింది. నిర్మల్ జిల్లా కుభీర్, లోకేశ్వరం మండలాలకు చెందిన రైతులకు మోసం చేశాడు మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సంస్థ సీఈవో.. దాదాపు కోటి రూపాయలకు పైగా రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వకుండా పరారయ్యాడు కుభీర్ మహిళ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సంస్థ సీఈవో శ్రీనివాస్. ధాన్యం కొనుగోళ్లలో దళారులబారి నుంచి రైతులను రక్షించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు సైతం దళారులరీతిలో మోసాలకు తెగబడటంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. కుభీర్ మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ద్వారా గత ఏడాది నుంచి దాదాపు 180 మంది మహిళా రైతులను చేర్చుకొని మొక్కజొన్న, సోయాబీన్, కందులు, జొన్నలను కొనుగోలు చేస్తోంది.

సంస్థ సీఈవో కుభీర్‌కు చెందిన వ్యక్తే కావడంతో రైతులు ఈ సంస్థను విశ్వసించి తమ వ్యవసాయ ఉత్పత్తులను ఈ సంస్థకే విక్రయిస్తున్నారు. గత నెలరోజులుగా సంస్థ డబ్బును ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. తమకు ఇవ్వాల్సిన డబ్బును వెంటనే చెల్లించాలని రైతులు సంస్థ చుట్టూ నెలరోజులపాటు తిరిగితే సంస్థ సీఈవో రైతులకు చెక్కులు ఇచ్చారు. చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేస్తే సంస్థ అక్కౌంట్‌లో డబ్బులు లేకపోవడంతో చెక్ బౌన్స్ కావడంతో తాము మోసపోయామని గ్రహించారు రైతులు..

ఈ విషయంపై గట్టిగా నిలదీయడంతో సీఈవో పరారయ్యాడని రైతులు తెలిపారు. ఇక లాభం లేదని రైతులంతా పోలీసులను ఆశ్రయించారు. సీఈవో శ్రీనివాస్‌పై కుభీర్ పోలీస్ స్టేషన్లో రైతులు ఫిర్యాదు చేసినట్లు భైంసా ఏఎస్పీ అవినాష్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు రావాల్సిన పంట డబ్బులను ఇప్పించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..