Central Bank Of India Jobs 2025: నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 ఉద్యోగాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా పలు బ్రాంచుల్లో అప్రెంటిస్ పోస్టుల నియామకాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో అనుభవం పొందాలనుకునే డిగ్రీ గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం..

ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా పలు బ్రాంచుల్లో అప్రెంటిస్ పోస్టుల నియామకాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 4500 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగంలో అనుభవం పొందాలనుకునే డిగ్రీ గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 23, 2025వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భర్తీ చేస్తున్న ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ వ్యవధి 12 నెలలు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనవరి 1, 2021 తర్వాత డిగ్రీ పూర్తిచేసిన వారు మాత్రమే అర్హులు. తప్పనిసరిగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి మే 31, 2025 తేదీ నాటికి 20 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు మే 31, 1997 నుంచి మే 31, 2005 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, ఓబీసీకి, పీడబ్ల్యూబీడీ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు NATS ఆన్‌లైన్ పోర్టల్ లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం సెంట్రల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో జూన్ 23, 2025లోపు అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.800, పీడీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.600 చొప్పున ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఫీజు చెల్లింపుకు జూన్ 25, 2025 చివరి తేదీ. ఆన్‌లైన్ రాత పరీక్ష, ప్రాంతీయ భాష నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష జూలై మొదటి వారంలో ఉండే అవకాశం ఉంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 కింద స్టైపెండ్ చెల్లిస్తారు. ఏడాదిఅప్రెంటీస్ శిక్షణ తర్వాత ఎలాంటి ఉద్యోగ హామీ ఉండదు. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.