AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పొలాలకు వెళ్తున్న రైతులు బీ కేర్‌ఫుల్.. వాటాని గమనిస్తే వెంటనే అధికారులు సమాచారం ఇవ్వండి!

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రోజులానే పొలానికి వెళ్లిన రైతును మృత్యువు వెంటాడింది. బైక్‌పై పోలానికి వెళ్తున్న మురళీధర్ రెడ్డి అనే రైతు 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి కరెంట్‌ షాక్‌తో మృతి చెందాడు. హైవోల్టేజ్‌ గత విద్యుత్‌ తీగలు బైక్‌కు తగలడంతో మురళీధర్ రెడ్డి బైక్‌తో సహా దగ్ధమైన మరణించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Telangana: పొలాలకు వెళ్తున్న రైతులు బీ కేర్‌ఫుల్.. వాటాని గమనిస్తే వెంటనే అధికారులు సమాచారం ఇవ్వండి!
Sathupalli
N Narayana Rao
| Edited By: |

Updated on: May 19, 2025 | 9:02 PM

Share

విద్యుత్‌వైర్‌ తగిలి ముళీధర్ రెడ్డి అనే రైతు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వివారల్లోకి వెళితే.. ఆదివారం సత్తుపల్లి ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చెట్లు విరిగి 11 కేవీ లైన్ విద్యుత్ తీగలు తెగి నేలపై పడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్తూరు గ్రామానికి చెందిన పైడిమర్ల పెద్ద మురళీధర్ రెడ్డి అనే రైతు రోజులాగే బైకు పై పొలానికి బయల్దేరాడు. అయితే విద్యుత్‌ తీగలు రోడ్డుపై పడిపోయి ఉండడాన్ని గమనించని మురలీధర్ రెడ్డి ఆలాగే బైక్‌తో వాటిపై నుంచి వెళ్లాడు. దీంతో ఆ విద్యుత్‌ వైర్లు బైక్‌కు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బైక్‌తో సహా మురళీధర్ రెడ్డి పూర్తిగా దగ్ధం అయ్యాడు.

అయితే ముందు రోజు ఈదురు గాలులతో పాటు కురిసిన భారీ వర్షానికి చెట్టు విరిగి 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో.. చెట్టుకూడా పూర్తిగా కాలిపోయింది. అయితే మురళీధర్ రెడ్డి పొలం వద్ద మంటలను గమనించిన అటుగా వెళ్తున్న స్థానికులు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపి వేసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సత్తుపల్లిలో గత కొద్ది రోజులుగా ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తరచూ విద్యుత్ స్తంభాలు విరిగి తీగలు నేలపై పడుతున్నాయి. పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. విద్యుత్‌ తీగల రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. రైతులు పొలాల్లోకి వెళ్లే ముందు జాగ్రత్తగా గమనించి వెళ్లాలని ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా విద్యుత్‌ తీగలు తెగిపడినట్టు గమనిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..