ఇళ్ల అనుమతికి అప్లై చేస్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త.! హెచ్చరిస్తున్న అధికారులు.? కారణమిదే.!

Fake Website In Google Search: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో తరహా కొత్తరకం సైబర్‌ నేరంతో అమాయకులే టార్గెట్‌గా ఫేక్ వెబ్‌సైట్లను...

  • Ravi Kiran
  • Publish Date - 1:05 pm, Mon, 18 January 21
ఇళ్ల అనుమతికి అప్లై చేస్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త.! హెచ్చరిస్తున్న అధికారులు.? కారణమిదే.!

Fake Website In Google Search: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో తరహా కొత్తరకం సైబర్‌ నేరంతో అమాయకులే టార్గెట్‌గా ఫేక్ వెబ్‌సైట్లను క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇళ్ల దరఖాస్తుదారులే లక్ష్యంగా ఓ ఫేక్ పోర్టల్‌ను క్రియేట్ చేశారు. భవనాలు, లేఅవుట్లకు ఆన్‌లైన్‌లో అనుమతుల మంజూరు చేయడం కోసం తెలంగాణ సర్కార్ టీఎస్-బీపాస్ పోర్టల్‌(https://tsbpass.telangana.gov.in/)ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

సరిగ్గా అలాంటి ఫేక్ సైట్‌(http://10061994. xyz/ tsbpass2/ index. html)ను ఒకటి సైబర్ నేరగాళ్లు తయారు చేశారు. ఇళ్ళ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి సంబంధించిన డెబిట్/క్రెడిట్ కార్డులు, ఫోన్ పే, గూగుల్ పే సమాచారాన్ని తెలుసుకుని బ్యాంక్ ఖాతాలను కొల్లగొట్టేందుకు ఈ నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు.

గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఒరిజినల్ పోర్టల్ కిందే ఈ నకిలీ వెబ్‌సైట్ దర్శనమిస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన లోగోలు అన్నీ కూడా ఈ ఫేక్ సైట్‌లో ఉండటంతో ప్రజలు మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, ఈ అంశంపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు గూగుల్ సంస్థకు కూడా సదరు వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయమని సమాచారం ఇచ్చారు. అలాగే ప్రజలు ఫేక్ వెబ్‌సైట్స్‌తో మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.