Harish Rao: అలా చేసుంటే సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైల్లో ఉండేవారు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాక ముందే.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం షురూ అయింది. ఈ తరుణంలో కాంగ్రెస్‌ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం BRS కార్యకర్తల్ని కేసులతో ఇబ్బంది పెట్టొచ్చు.. కార్యకర్తలెవరూ భయపడొద్దు, పార్టీ అండగా ఉంటుందంటూ పేర్కొన్నారు.

Harish Rao: అలా చేసుంటే సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైల్లో ఉండేవారు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..
Harish Rao
Follow us

|

Updated on: Dec 13, 2023 | 5:41 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాక ముందే.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం షురూ అయింది. ఈ తరుణంలో కాంగ్రెస్‌ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం BRS కార్యకర్తల్ని కేసులతో ఇబ్బంది పెట్టొచ్చు.. కార్యకర్తలెవరూ భయపడొద్దు, పార్టీ అండగా ఉంటుందంటూ పేర్కొన్నారు. తాము కేసులు పెట్టుంటే సగంమంది కాంగ్రెస్‌ నేతలు జైల్లో ఉండేవారంటూ పేర్కొన్నారు. కేసీఆర్‌ పనితనం తప్ప, పగతనం తెలియని నాయకుడని.. వివరించారు. అందుకే, కొత్త రాష్ట్రంలో కక్షలు పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టిపెట్టామని హరీష్ రావు వ్యాఖ్యానించారు. హౌజింగ్‌ స్కామ్‌లో ఎంతోమంది కాంగ్రెస్‌ నేతల పేర్లున్నాయని.. ఒక్కో కాంగ్రెస్‌ నాయకుడు 40, 50 ఇళ్ళను కొట్టేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభలో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. నర్సాపూర్ అంటే బీఆర్ఎస్ కి కంచుకోట అని మరోసారి నిరూపించారని.. ఇక్కడ గెలిచాం.. కానీ ప్రభుత్వం పోయింది అని బాధ ఉంది మనకు.. బీఆర్ఎస్ కి ఈ ఓటమి.. ఒక బ్రేక్ మాత్రమే.. అంతిమ గమ్యం, విజయం బీఆర్ఎస్ దే అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లు గోబెల్స్ ప్రచారం చేశారు.. ఈ నిజం అతి త్వరలోనే తెలుస్తోందంటూ హరీష్ రావు పేర్కొన్నారు.

కేసీఆర్ పనితనం ఉన్న మనిషి తప్ప.. పగతనం అనేది ఆయన వద్ద లేదని.. కక్షలు,కుట్రలు లేకుండా తాము పనిచేశామని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఒడిదుడుకులు సహజం.. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. విజయం సాధించినప్పుడు పొంగిపోలేదు.. ఓడినప్పుడు కుంగిపోలేదు.. పనిమంతులు ఎవరు అనేది త్వరలోనే ప్రజలే గమనిస్తారంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త