Bhuma Akhila Priya: అఖిల ప్రియకు ఇప్పటికీ నో బెయిల్.. విచారణను ఆ రోజుకు వాయిదా వేసిన సికింద్రాబాద్ కోర్టు

ఈ నెల 5న బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు, ఆయన ఇద్దరు సోదరుల కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు ఊరట లభించలేదు. ఆమె బెయిల్ పిటిషన్‌పై శనివారం సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరిగింది.

Bhuma Akhila Priya: అఖిల ప్రియకు ఇప్పటికీ నో బెయిల్.. విచారణను ఆ రోజుకు వాయిదా వేసిన సికింద్రాబాద్ కోర్టు
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 16, 2021 | 3:45 PM

Bhuma Akhila Priya: ఈ నెల 5న బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు, ఆయన ఇద్దరు సోదరుల కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు ఊరట లభించలేదు. ఆమె బెయిల్ పిటిషన్‌పై శనివారం సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో న్యాయస్థానం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతానికి అఖిల ప్రియకు బెయిల్ రాలేదు. బోయినపల్లి ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో మరికొంతమంది నిందితులు దొరకాల్సి ఉంది. అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, సోదరడు జగన్ విఖ్యాత్ రెడ్డి సహా మరో నిందితుడు గుంటూరు శ్రీను  కోసం కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.

ఇక అఖిల ప్రియ మూడు రోజులు కస్టడీ గడువు గురువారంతో ముగిసింది.  అయితే పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు ఆమె మౌనం వహించినట్లు సమాచారం.  తాజాగా భార్గవ్‌రామ్‌ తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్‌లకు కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన సంపత్‌కుమార్‌, మల్లికార్జునరెడ్డి, బాలచెన్నయ్యలను కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కాగా విచారణ ముగిసిన అనంతరం అఖిల ప్రియకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, వెస్ట్‌ మారేడ్‌పల్లిలో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Also Read:

Cricketer Sophie Devine: సోఫీ డెవిన్.. మ్యాచ్ మాత్రమే కాదు హృదయాలను కూడా గెలుచుకుంది.. వావ్..

Ice cream tests positive for corona: ఐస్‌ క్రీమ్‌ ద్వారా కరోనా వ్యాప్తి.. సంచలన విషయాన్ని వెల్లడించిన పరిశోధకులు!

ABP-C Voter Survey: జాతీయ స్థాయిలో జగన్ మార్క్.. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వేలో మెరుగైన ర్యాంక్.. టాప్-5 సీఎంలు వీరే