Increased Voters: గ్రేటర్ ఎన్నికల తర్వాత హైదరాబాద్‌లో పెరిగిన ఓటర్ల సంఖ్య.. కొత్త ఓటర్లు ఎంతమందంటే..
Increased Voters: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల తర్వాత నగరంలో ఓటర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కొత్తగా 41,189 మంది ఓటర్లు పెరిగారు.
Increased Voters: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల తర్వాత నగరంలో ఓటర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కొత్తగా 41,189 మంది ఓటర్లు పెరిగారు. 2,416 మంది పేర్లు తొలగించబడ్డాయి. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా నవంబర్ 16, 2020న ప్రకటించిన జాబితాలో 42.70 లక్షల ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం నెలన్నర రోజుల్లోనే 41 వేల మందికిపైగా ఓటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లాలోని15 నియోజకవర్గాల్లో మొత్తం 43.11 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యల్పంగా చార్మినార్, సనత్‌నగర్‌లలో ఉంటారు.
జిల్లాలో మొత్తం 43.11 లక్షల ఓటర్లు ఉండగా అందులో పురుషులు 22.30 లక్షల మంది, మహిళలు 20.81 లక్షల మంది, ఇతరులు 222 మంది ఓటర్లు ఉన్నారు. బహదూర్‌పురా నియోజకవర్గంలోనే అత్యధికంగా ఇతరులు 51 మంది నమోదయ్యారు. జిల్లాలోని మొత్తం ఇతరుల కేటగిరీ ఓటర్లలో ఇది 23 శాతంగా ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 3.68 లక్షల మంది ఓటర్లు ఉండగా 3.39 లక్షలతో యాకుత్‌పురా.3.31 లక్షలతో కార్వాన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చార్మినార్‌లో అత్యల్పంగా 2.15 లక్షల ఓటర్లు, ఆ తర్వాతి స్థానంలో సనత్‌నగర్‌లో 2.45 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా నవంబర్‌లో 2,416 మంది పేర్లు తొలగించారు. ఆ తర్వాతి స్థానాల్లో గోషామహల్‌లో 302, బహదూర్‌పురాలో 230 మంది పేర్లు తొలగించారు. చాంద్రాయణగుట్టలో అత్యల్పంగా 81 ఓట్లు తొలగించారు. ఖైరతాబాద్‌లో 107 మంది పేర్లు కొత్త జాబితా లేవు. జూబ్లీహిల్స్‌లో 4,664 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. చాంద్రాయణగుట్టలో 3,858 మంది కొత్త ఓటర్లు, అత్యల్పంగా కంటోన్మెంట్‌లో 673 కొత్త ఓటర్లు, సనత్‌నగర్‌లో 1,669 మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు.
యువతా నీవెక్కడ…గ్రేటర్‌లో ముఖం చాటేసిన టెక్కీలు.. సోషల్ మీడియాలో ఊదరగొట్టే నెటిజన్లు ..