హైదరాబాద్‌లో ఎలక్షన్ అంటే హాలిడేలా ఫీలవుతారు.. ఓటర్లను బూత్‌ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి : శ్రేణులకు కవిత పిలుపు

హైదరాబాద్‌లో ఎలక్షన్ అంటే హాలిడేలా ఫీలవుతారని, అలా కాకుండా ఓటర్లను బూత్‌ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు ఆపార్టీ ఎమ్మెల్సీ కవిత. ప్రచారానికి సమయం తక్కువగా ఉంది.. ప్రతీ గడపకూ వెళ్ళండి.. ఉత్సాహం ప్రచారంలోనే కాదు.. ఓట్లు వేయించే వరకూ ఉండాలి అని ఆమె కార్యకర్తలను కార్మోన్ముఖుల్ని చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కవిత మాట్లాడుతూ.. ప్రజలు అడగకముందే పనులు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉందని, ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల […]

  • Venkata Narayana
  • Publish Date - 10:19 pm, Sat, 21 November 20

హైదరాబాద్‌లో ఎలక్షన్ అంటే హాలిడేలా ఫీలవుతారని, అలా కాకుండా ఓటర్లను బూత్‌ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు ఆపార్టీ ఎమ్మెల్సీ కవిత. ప్రచారానికి సమయం తక్కువగా ఉంది.. ప్రతీ గడపకూ వెళ్ళండి.. ఉత్సాహం ప్రచారంలోనే కాదు.. ఓట్లు వేయించే వరకూ ఉండాలి అని ఆమె కార్యకర్తలను కార్మోన్ముఖుల్ని చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కవిత మాట్లాడుతూ.. ప్రజలు అడగకముందే పనులు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉందని, ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆటలు సాగవని పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కష్టించి పని చేయాలని గాంధీనగర్‌లో పార్టీ కార్యకర్తలు కాలర్ ఎగురవేసుకుని తిరిగేలా పనులు చేశామని, ప్రతీ ఒక్కరి దగ్గరికి వెళ్లి వినమ్రంగా ఓటు అడగాలని విజ్ఞప్తి చేశారు. గోకుల్ చాట్, లుంబినీ పార్క్, దిల్ సుఖ్‌నగర్‌లో గతంలో బాంబు పేలుళ్ళు జరిగాయని, అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని కవిత తెలిపారు.