Fire Accident: శంషాబాద్‌లో విషాదం.. గేదెల కొట్టానికి నిప్పు పెట్టిన దుండగులు.. ఆరు గేదెలు సజీవ దహనం..
Fire Accident: శంషాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు గేదెల కొట్టానికి నిప్పటించారు. దాంతో గేదెల కొట్టం..
Fire Accident: శంషాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు గేదెల కొట్టానికి నిప్పటించారు. దాంతో గేదెల కొట్టం మొత్తం మంటలకు ఆహుతైపోయింది. ఈ ప్రమాదంలో ఆరు గేదెలు సజీవ దహనం అయ్యాయి. ప్రమాదంపై బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌కు చెందిన ప్రేమ్ కుమార్‌కు ఆరు గేదెలు ఉన్నాయి. వాటిని తన పొలం వద్ద కొట్టంలో కట్టేసేవాడు. రోజూలాగే ఇవాళ కూడా గేదెలను తన పొలంలోని కొట్టంలో కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు.
అయితే గుర్తు తెలియని దుండగులు ఆ కొట్టానికి నిప్పు అంటించారు. ఆ మంటలకు గేదెల కొట్టం మొత్తం దగ్ధం అవగా.. అందులో ఉన్న ఆరు గేదెలు సజీవ దహనం అయ్యాయి. విషయం తెలుసుకున్న ప్రేమ్ కుమార్, కుటుంబ సభ్యులు తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. మృతి చెందిన గేదెలను చూసి బోరున విలపించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది అగంతకుల పనే అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
Also read: