గాయపడ్డ తండ్రిని పరామర్శించేందుకు సొంతూరుకు జవాను.. రోడ్డు ప్రమాదంలో గాయపడి..ఆర్మీ దినోత్సవం రోజే
అతడు దేశానికి కాపు కాస్తున్న ఓ జవాను. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో చూసేందుకు సెలవుపై వచ్చాడు. ఆపై ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో 18 రోజులపాటు మృత్యువుతో పోరాడాడు.
అతడు దేశానికి కాపు కాస్తున్న ఓ జవాను. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో చూసేందుకు సెలవుపై వచ్చాడు. ఆపై ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో 18 రోజులపాటు మృత్యువుతో పోరాడాడు. చివరకు ఆర్మీ దినోత్సవం రోజు తుదిశ్వాస విడిచాడు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం మేఘ్యానాయక్ తండాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తండాలో నివశించే జోద్యా నాయక్, జెమిలీ బాయి దంపతులకు ముగ్గురు తనయులు. ద్వితీయ పుత్రుడు మోతీ లాల్ బీటెక్ కంప్లీట్ చేసి..2017లో ఆర్మీలో చేరాడు. పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు. పొలం పనుల్లో ప్రమాదవశాత్తూ తండ్రి కాలు విరగడంతో.. నెల క్రితం 15 రోజుల సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. ఈ సమయంలోనే అతడికి బంధువులు అమ్మాయితో పెండ్లి కూడా కుదిరింది.
సెలవులు ముగియడంతో డిసెంబర్ 29న తిరిగి విధుల్లో చేరేందుకు పయనమయ్యాడు. 28 తేదీన విమాన టికెట్ తెచ్చుకునేందుకు బైక్‌పై ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో 44 నంబర్ నేషనల్ హైవేపై అతడి వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢికొట్టింది. తలకు బలమైన గాయం అవ్వడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మోతీ లాల్ శుక్రవారం కన్నుమూశాడు.
Also Read:
Cricketer Sophie Devine: సోఫీ డెవిన్.. మ్యాచ్ మాత్రమే కాదు హృదయాలను కూడా గెలుచుకుంది.. వావ్..