Egg Prices: పడిపోతున్న కోడిగుడ్డు ధరలు.. కొండెక్కుతున్న చికెన్ రేట్లు
రోజురోజుకు పెరిగిపోతున్న ఎండలు కోళ్ల పరిశ్రమపై(Poultry) తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కోళ్ల దాణా ధరలు ఆకాశాన్నంటుతుండగా మరో వైపు కోడిగుడ్ల ధర మాత్రం రోజురోజుకు పడిపోతోంది. ఒక్కసారిగా దాణా రేట్లు పెరిగిపోవడంతో....

రోజురోజుకు పెరిగిపోతున్న ఎండలు కోళ్ల పరిశ్రమపై(Poultry) తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కోళ్ల దాణా ధరలు ఆకాశాన్నంటుతుండగా మరో వైపు కోడిగుడ్ల ధర మాత్రం రోజురోజుకు పడిపోతోంది. ఒక్కసారిగా దాణా రేట్లు పెరిగిపోవడంతో ఫౌల్ట్రీ ఫాం నిర్వాహకులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. గుడ్డు(Egg) ధర మూడు రూపాయలకు చేరు కోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోళ్ల దాణా టన్ను రూ.18 వేల నుంచి రూ.30 వేలకు చేరుకోవడం, కోళ్ల మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, ఉష్టోగ్రతలు 42 డిగ్రీలు పైగా పెరగుతుండడంతో ఎండ వేడి తట్టుకోలేక కోళ్లు చనిపోతున్నాయి. పెరిగిన విద్యుత్ చార్జీలు, కూలీలకు వేతనాలు, ఇతర ఖర్చులతో కలుపుకుని ఒక గుడ్డు ఉత్పత్తికి సుమారుగా రూ.4 ల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర రూ.4.23 ఉన్నప్పటికీ రైతులకు మాత్రం రూ.2.95 లు మాత్రమే చెల్లిస్తుండడంతో రైతులకు నష్టాలు వస్తున్నాయి. ఎగుమతులు అంతంత త్రంగా ఉండడంతో రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రస్తుత పరిస్థితిని బట్టి కొత్త బ్యాచ్‌లను వేసేందుకు నిర్వాహకులు వెనకడుగు వేస్తున్నారు.
మరోవైపు.. చికెన్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కేజీ చికెన్ ధర రూ.300కు చేరువలో ఉంది. గతేడాది అక్టోబర్ లో మొదలైన పెరుగుదల ఇప్పటి వరకూ తగ్గలేదు. దీంతో సామాన్యులు చికెన్ తినే పరిస్థితి లేకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత చికెన్ రేటు తగ్గుతుందని భావించినప్పటికీ ధరలు ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు పెళ్ళిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కిలో చికెన్ మార్కెట్‌లో రూ.250 నుంచి రూ.300 పలుకుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Ice Facial Side Effects: ఐస్ ఫేషియల్ ట్రై చేస్తున్నారా.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి..!
Side Effects of Ghee: నెయ్యి వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..