Summer Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి వేసవి సెలవులు.. ఎప్పటి వరకు అంటే..
Summer Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రకటించింది. ఎండలు ముదిరిపోతున్న..
Summer Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రకటించింది. ఎండలు ముదిరిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక జూన్ 13వ తేదీన పాఠశాలలు (Schools) తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ వేసవి సెలవులు 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఉంటాయి. మే 23 నుంచి 28వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. రేపటి నుండి10 వ తరగతి విద్యార్థులకు రివిజన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రతి రోజు ఒక ఉపాధ్యాయుడు హాజరై పదో తరగతి విద్యార్ధులకు రివిజన్ క్లాసులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది.
వారి పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక రేపటి నుంచి వేసవి సెలవులు ఉన్నందున ప్రైవేటు పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది తెలంగాణ విద్యాశాఖ. కాగా మే 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉండగా, మే 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: