Telangana: తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు రీ-ఓపెన్..

తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యశాఖ సూచనలతో వచ్చే నెల ఒకటవ తారీఖు నుంచి...

Telangana: తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు రీ-ఓపెన్..
Telangana Schools Reopen
Follow us
Vidyasagar Gunti

| Edited By: Anil kumar poka

Updated on: Sep 19, 2022 | 1:32 PM

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కరోనా(Corona) ప్రభావంతో మూతపడిన పాఠశాలలను పున:ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరుకు విద్యాశాఖలోని అని విభాగాలకు ఆదేశాలను జారీ చేశారు. కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ విద్యాలయాలు తెరవాలని స్కూల్, హైయర్ ఎడ్యూకేషన్ విభాగాలకు ఆదేశాలు ఇచ్చారు.

కరోనా కారణంగా మూతపడ్డ విద్యాసంస్థలు మంగళవారం నుంచి తెరుచుకోనున్నాయి. సంక్రాంతికి ఇచ్చిన సెలవులను కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ఈనెల 30 వరకు పొడిగించారు. రేపటితో సెలవులు ముగుస్తుండటంతో ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవడం, అక్కడ విద్యార్థులపై కరోనా ప్రభావం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తక్కువగా ఉందన్న వైద్యఆరోగ్య శాఖ సూచనలతో పాఠశాలలు రీ ఓపెనింగ్ సరైన సమయంగా విద్యాశాఖ భావించింది. విద్యా సంస్థల్లో 15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని వైద్యశాఖకు సూచించింది.

ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో టీవీ, ఆన్​లైన్ తరగతులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులకు మాత్రమే టీ శాట్, దూరదర్శన్, వాట్సప్ తో ఆన్ లైన్ బోధన జరిగింది. ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వాదనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇప్పటికే ఇంటర్‌, పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. వాటి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ను కూడా వెల్లడించాల్సి ఉంది. దీనికి ప్రతిపాదనలను సిద్ధం చేసి స్కూల్స్ రీఓపెనింగ్ తర్వాత ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సెలవులు కొనసాగితే సిలబస్ పూర్తి చేయడం కష్టతరం అవుతుందని..దాని ప్రభావం వార్షిక పరీక్షలపై పడుతుందని పలు సంఘాలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికితీసుకొచ్చాయి. తాజాగా విద్యాసంవత్సరాన్ని పొడిగించాలన్న విజ్ఞప్తిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో జరగాల్సిన పరీక్షలను మే నెలలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మే 30 వరకు విద్యాసంవత్సరాన్ని పొడిగిస్తారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి

ఇదిలా ఉంటే.. విద్యార్ధుల చదువును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలను ఫిబ్రవరి 1వ తేది నుంచి తిరిగి పునః ప్రారంభించడంపై టీఎస్టీసీఈఏ హర్షం వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైద్యశాఖ మంత్రి హరీష్ రావు, ఇతర ఉన్నతాధికారులకు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు, తల్లిదండ్రులు ,ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు కృతజ్ఞతలు తెలిపాయి. అలాగే విద్యార్ధుల భవిష్యత్తు దృష్ట్యా ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని పొడిగించాలంటూ టీఎస్టీసీఈఏ కోరింది.

(విద్యా సాగర్, టీవీ9 రిపోర్టర్)

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే