
తెలంగాణలో 20 రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న క్వశ్చన్‌కు మరికొన్ని గంటల్లో ఆన్సర్ దొరకనుంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 34 కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్భందీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి ఎన్ని సీట్లొస్తాయ్..? అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్‌ఎస్ పుంజుకుంటుందా.? డబుల్ డిజిట్ పక్కా అంటున్న బీజేపీ మాట నిలబెట్టుకుంటుందా.? ఈ ప్రశ్నలన్నింటికి మరికొన్ని గంటల్లో సమాధానం దొరనుంది. రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును పగడ్బంధీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10వేల మంది సిబ్బంది కౌంటింగ్ విధులను నిర్వహించనున్నారు. మరో 50 శాతం మంది అడిషనల్‌గా అందుబాటులో ఉండనున్నారు. అంతేకాదు 2వేల 440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
ఈసారి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కౌంటింగ్‌లో అత్యధికంగా చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండలో 24 రౌండ్లు ఉండగా.. అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక, చేవెళ్ల, మల్కాజ్‌గిరిలో పోస్టల్ బ్యాలెట్ ఈ- కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఈసారి 2లక్షల 80వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ స్పష్టం చేసింది. అలర్లు, హింసాత్మక ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఈవో వికాస్‌రాజ్. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉండనుంది. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేయనున్నారు అధికారులు. మొత్తంగా.. తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. ఎవరు గెలుస్తారన్ని మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. మరోవైపు నేతల్లో హైటెన్షన్ మొదలైంది. బయటకు గెలుస్తామని ధీమాగా చెబుతున్నా.. లోపల మాత్రం టెన్షన్ పట్టుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..