Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: కౌన్‌ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్‌…? రేసులో ఆ ముగ్గురు.. ఎవరెవరంటే..

తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక క్లైమాక్స్‌కి చేరుకుంది. ఈ నెలాఖరుకే రాష్ట్ర బీజేపీకి కొత్త రథసారథి వస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడంతో.. కౌన్‌ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్‌...? అంటూ కాషాయ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.. అయితే.. ముగ్గురు పేర్లు షార్ట్ లిస్ట్ అయినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది..

Telangana BJP: కౌన్‌ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్‌...? రేసులో ఆ ముగ్గురు.. ఎవరెవరంటే..
Telangana Bjp
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 19, 2025 | 1:00 PM

తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక క్లైమాక్స్‌కి చేరుకుంది. ఈ నెలాఖరుకే రాష్ట్ర బీజేపీకి కొత్త రథసారథి వస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడంతో.. కౌన్‌ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్‌…? అంటూ కాషాయ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.. అయితే.. ఇదే కొశ్చన్‌పై గతకొన్ని రోజులుగా పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌హాట్‌ డిబేట్స్‌ నడుస్తున్నాయ్. అయితే టీబీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఆల్‌ మోస్ట్ క్లైమాక్స్‌కి చేరుకుంది. షార్ట్‌లిస్ట్‌ సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ముగ్గురు నేతలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. షార్ట్‌లిస్ట్‌లో ఈటల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లు ఉన్నట్లు సమాచారం..

ఈ సారి తనకు ఛాన్స్‌ ఇవ్వాలంటూ బీజేపీ పెద్దల్ని కలిశారు రామచంద్రరావు.. పార్టీలో మొదట్నుంచి ఉండడం, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుతో.. అధ్యక్ష పదవి కోసం రామచంద్రరావు ప్రయత్నాలు చేస్తున్నారు. సునీల్‌ బన్సల్‌, బీఎల్ సంతోష్‌ సహా ముఖ్యనేతలతో.. ఇప్పటికే అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకులు సమావేశమయ్యారు.. అయితే.. హైకమాండ్ మహిళా కోటాలో డీకే అరుణ పేరు పరిశీలిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. రెడ్డి సామాజికవర్గ సమీకరణాలు డీకే అరుణకు ప్లస్‌ పాయింట్స్ గా చెబుతున్నారు.. అయితే.. ముగ్గురిలో రేసులో ఈటల రాజేందర్‌ ముందున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో బీసీ నినాదం వినిపించేందుకు ఈటల ఆప్షన్ అని.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈటలకు ప్లస్‌ పాయింట్‌ అవుతుందని చెబతున్నారు. అయితే.. షార్ట్ లిస్ట్ లో ఉన్న పేర్లను పరిశీలించిన తర్వాత త్వరలోనే కొత్త అధ్యక్షుడిని మోదీ, అమిత్ షా ఫైనల్ చేయనున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి ప్లేస్‌లో గతకొన్ని రోజులుగా చాలా పేర్లే వినిపించాయి. ఈటలతో పాటు ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు పేర్లు తెరపైకి వచ్చాయి. కేంద్రమంత్రి బండి సంజయ్‌ కూడా ఉంటారనే ప్రచారం కూడా జరిగింది. ఐతే అన్నీ తోసిపుచ్చుతూ.. ఇప్పుడు 3 పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈటల, డీకే అరుణ, రామచంద్రరావు.. ఈ ముగ్గురిలో ఒకరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ఛాన్స్‌ ఎక్కువగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్ష పదవిపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆర్‌ఎస్ఎస్‌ నేపథ్యం ఉండాలన్న నిబంధనేది లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌ను రాష్ట్ర నేతల ఏకాభిప్రాయంతో సెలెక్ట్ చేస్తారని, వారం రోజుల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక ఉంటుందని కిషన్‌ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో తర్వాత ప్రెసిడెంట్ ఎవరో తెలిసిపోయిందని, బీఆర్‌ఎస్‌ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని, బీజేపీలో వచ్చే అధ్యక్షుడు ఎవరో ఎవరూ చెప్పలేరని కిషన్ రెడ్డి అన్నారు. కొత్త సభ్యత్వాలు,పోలింగ్ బూత్ కమిటీలు,మండల కమిటీలు పూర్తయ్యాయని జిల్లా కమిటీల ఎన్నిక ప్రక్రియ నడుస్తోందని తెలిపారు. 600 మండల కమిటీలు పూర్తి చేస్తే..అందులో 50 శాతంపైగా బీసీలకే అధ్యక్ష బాధ్యతలు ఇచ్చామని తెలిపారు.

పార్టీలో మహిళలకు 33 శాతం పదవులు ఇస్తామని స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని అన్నారు. తెలంగాణలో ఎవరితో పొత్తు ఉండదని, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉచితాలు వద్దని బీజేపీ ఎక్కడా చెప్పలేదని, రాష్ట్ర ఆదాయ వనరులను చూసుకుని ఎన్నికల హామీలు ఇ్వవాలని ఆయన అన్నారు. హైదరాబాద్‌ మెట్రోఫేజ్‌-2 నిర్మాణానికి కేంద్ర సహకారం ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ సుకుమారి స్పర్శతో ఆ చీర పునీతం అయింది.. మెస్మరైజ్ అనన్య..
ఈ సుకుమారి స్పర్శతో ఆ చీర పునీతం అయింది.. మెస్మరైజ్ అనన్య..
43 బంతుల్లో 0 పరుగులు 4 వికెట్లు.. దుమ్ములేపిన కోహ్లీ దోస్త్
43 బంతుల్లో 0 పరుగులు 4 వికెట్లు.. దుమ్ములేపిన కోహ్లీ దోస్త్
రూల్స్‌ మరింత కఠినం.. ఈ డీలర్లు సిమ్ కార్డులను విక్రయించలేరు!
రూల్స్‌ మరింత కఠినం.. ఈ డీలర్లు సిమ్ కార్డులను విక్రయించలేరు!
AI ఫీచర్లతో కూడిన సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. రూ.30 వేల లోపే..
AI ఫీచర్లతో కూడిన సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. రూ.30 వేల లోపే..
యష్ సినిమా ఆ విషయంలో ఫస్ట్ ప్రాజెక్ట్..
యష్ సినిమా ఆ విషయంలో ఫస్ట్ ప్రాజెక్ట్..
15 ఏళ్ల తర్వాత డబుల్ సెంచరీ.. క్రికెట్ గాడ్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్
15 ఏళ్ల తర్వాత డబుల్ సెంచరీ.. క్రికెట్ గాడ్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్
పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
వారికి శని దోషం..ఈ పరిహారాలతో శనీశ్వరుడు శాంతించే అవకాశం..!
వారికి శని దోషం..ఈ పరిహారాలతో శనీశ్వరుడు శాంతించే అవకాశం..!
మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది..?
మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది..?
సోలో ట్రిప్ సజావుగా.. ఆడవారు మీ ప్రయాణాన్ని ఇలా ప్లాన్ చేస్కోండి
సోలో ట్రిప్ సజావుగా.. ఆడవారు మీ ప్రయాణాన్ని ఇలా ప్లాన్ చేస్కోండి