Dasara Holidays: ఇంటర్ విద్యార్థులకు సూపర్ న్యూస్.. దసరా సెలవులు ఎప్పటినుంచో తెలుసా

దసరా వచ్చేసింది.. గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా సందడి నెలకొంది.. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో.. అన్ని చోట్లా పండగ వాతావరణమే కనిపిస్తోంది.. బతుకమ్మ సంబరాలు, నవరాత్రి వేడుకలతో తెలంగాణ వ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి..

Dasara Holidays: ఇంటర్ విద్యార్థులకు సూపర్ న్యూస్.. దసరా సెలవులు ఎప్పటినుంచో తెలుసా
Inter Students Holidays
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 03, 2024 | 7:20 PM

దసరా వచ్చేసింది.. గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా సందడి నెలకొంది.. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో.. అన్ని చోట్లా పండగ వాతావరణమే కనిపిస్తోంది.. బతుకమ్మ సంబరాలు, నవరాత్రి వేడుకలతో తెలంగాణ వ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.. ఇప్పటికే.. స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.. ఈ క్రమంలోనే తెలంగాణ జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించింది.. ఈ నెల 6 నుంచి 13 వరకు ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులను ప్రకటిస్తూ గురువారం ప్రకటన విడుదల చేసింది.. తిరిగి 14న జూనియర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి.. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది..

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొత్తం 8 రోజుల పాటు దసరా సెలవులను ప్రకటించింది. అన్ని కళాశాలలు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని వెల్లడించింది.. ప్రైవేటు కళాశాలలు కూడా ఈ సర్క్యూలర్ ను తప్పనిసరిగా పాటించాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.

ఇంటర్ బోర్డ్ సర్క్యూలర్..

Inter Board

కాగా.. తెలంగాణలో స్కూళ్లకు దసరా సెలవులు నిన్నటినుంచే ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 02 నుంచి 14 వరకు దసర సెలవులు ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర విద్యాశాఖ‌ సర్క్యూలర్ జారీ చేసింది. సెలవుల అనంతరం ఈనెల 15న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. ఇలా ఇరుక్కుపోయారు
గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. ఇలా ఇరుక్కుపోయారు
బ్యాంకులు.. వచ్చే జనవరిలో 15 రోజులే పని చేస్తాయి..
బ్యాంకులు.. వచ్చే జనవరిలో 15 రోజులే పని చేస్తాయి..
కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే
కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే
నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త
నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త
సెక్యూరిటీ సిబ్బందంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి
సెక్యూరిటీ సిబ్బందంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి
న్యూ ఇయర్ గిఫ్ట్.. పుష్ప-2 లో మరికొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా?
న్యూ ఇయర్ గిఫ్ట్.. పుష్ప-2 లో మరికొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా?
ఈ కార్‌లో జీవితాంతం ఫ్రీగా తిరిగేయచ్చు! కార్ల బాడీపై సోలార్‌ ఫొటో
ఈ కార్‌లో జీవితాంతం ఫ్రీగా తిరిగేయచ్చు! కార్ల బాడీపై సోలార్‌ ఫొటో
రాంగ్‌ నెంబర్‌కి యూపీఐ పేమెంట్‌ చేశారా? 48 గంటల్లో రిఫండ్‌ ఇలా.!
రాంగ్‌ నెంబర్‌కి యూపీఐ పేమెంట్‌ చేశారా? 48 గంటల్లో రిఫండ్‌ ఇలా.!
ఇక వాళ్లంతా 125 - 130 ఏళ్ళు.. ఈజీగా బతుకుతారా.?
ఇక వాళ్లంతా 125 - 130 ఏళ్ళు.. ఈజీగా బతుకుతారా.?
గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి ఇలా ఇరుక్కుపోయా
గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి ఇలా ఇరుక్కుపోయా