Singareni Employees: సింగరేణి ఉద్యోగులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి
Singareni Employees: సింగరేణి సంస్థ తమ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది. ఉద్యోగుల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వనుంది. గతంలో నిర్మించిన..
Singareni Employees: సింగరేణి సంస్థ తమ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది. ఉద్యోగుల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వనుంది. గతంలో నిర్మించిన క్వార్టర్లకు భిన్నంగా రెండు బెడ్‌రూమ్‌లు, హాల్, కిచెన్, కామన్ ఏరియాతో కలిపి మొత్తం 963 చదరపు అడుగుల ఇండ్లు నిర్మించి ఇస్తోంది. అయితే తొలి విడతలో 1,478 క్వార్టర్ల నిర్మాణ పనులు వేగవంతం జరుగుతున్నాయని సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ తెలిపారు.
ఇందు కోసం రూ.333 కోట్ల ఖర్చు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే జూన్ నాటికి 352 గృహాలు పూర్తి కానుండగా, ఈ ఏడాది చివరి నాటికి మొత్త ఇళ్లను పూర్తి చేయనున్నట్లు ఆయన వివరించారు. పూర్తయిన తర్వాత ఉద్యోగులకు కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఒక్క భూపాలపల్లి ప్రాంతంలో రూ.216 కోట్ల వ్యయంతో 994 క్వార్టర్లు నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. ఇక్కడ కొత్త గనులు వస్తున్నందున గృహ వసతిని పెంచుతున్నామన్నారు. సత్తుపల్లిలో రూ.80 కోట్లతో నిర్మిస్తున్న 252 క్వార్టర్లు జూన్ వరకు సిద్దం అవుతాయని అన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో సుమారు రూ.37 కోట్ల వ్యయంతో 132 క్వార్టర్ల నిర్మాణం తుది దశకు చేరుకుందని ఆయన వెల్లడించారు.
Also Read: