బయో ఏషియా18వ ఎడిషన్‌ థీమ్‌ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్.. సదస్సు గురించి ఏం మాట్లాడారంటే..

బయో ఏషియా సదస్సు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రధాన కార్యక్రమం అని మంత్రి కేటీఆర్ అన్నారు. బయోఏషియా 18వ ఎడిషన్‌ థీమ్‌, వెబ్‌సైట్‌ను

  • uppula Raju
  • Publish Date - 2:17 pm, Tue, 19 January 21
బయో ఏషియా18వ ఎడిషన్‌ థీమ్‌ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్.. సదస్సు గురించి ఏం మాట్లాడారంటే..

బయో ఏషియా సదస్సు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రధాన కార్యక్రమం అని మంత్రి కేటీఆర్ అన్నారు. బయోఏషియా 18వ ఎడిషన్‌ థీమ్‌, వెబ్‌సైట్‌ను హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బయో ఏషియా-2021 అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 22, 23 తేదీల్లో జరగనుందని అన్నారు.

కరోనా నేపథ్యంలో ఈసారి సదస్సును ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో పాటు నోబెల్‌, లాస్కర్‌, బ్రేక్‌త్రూ అవార్డు గ్రహీతలు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో లైఫ్‌ సైన్సెస్‌ రంగంపై చర్చ జరగనుందన్నారు.ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌కేర్‌ సిబ్బందిని ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్‌ మాట్లాడుతూ.. ఈ సదస్సులో 50 దేశాలకు చెందిన 1,500 మంది ఉన్నతస్థాయి అధికారులు పాల్గొంటారని తెలిపారు. మొదటిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందున ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది లైఫ్‌ సైన్సెస్‌ నిపుణులు భాగస్వామ్యమయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలో దారుణం.. ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట.. కారణం ఏంటంటే..