వయసు నాలుగేళ్లే.. బ్యాట్ పట్టుకుంటే సిక్సులే.. మంత్రి కేటీఆర్ ఫిదా.. వీడియో వైరల్..
సాధరణంగా క్రికెట్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. కుర్రాళ్ల నుంచి చిన్న పిల్లల వరకు క్రికెట్ ఫ్యాన్స్ ఉంటుంటారు. ఇక
సాధరణంగా క్రికెట్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. కుర్రాళ్ల నుంచి చిన్న పిల్లల వరకు క్రికెట్ ఫ్యాన్స్ ఉంటుంటారు. ఇక గల్లీలో క్రికెట్ ఆడుతూ.. రోజంతా అక్కడే గడిపేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ నాలుగెళ్ళ బుడతడు మాత్రం క్రికెట్ బంతిని అలవోకగా బౌండరీలు దాటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఓ నెటిజన్ ట్యాగ్ చేశాడు. ఆ వీడియోను చూసిన కేటీఆర్ దానికి రిప్లై కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇక ఆ వీడియో ఓ నాలుగెళ్ళ చిన్నారి క్రికెట్ ఆడుతున్నాడు. బ్యాట్ పట్టుకొని వచ్చే ప్రతి బంతిని ఏకంగా బౌండరీలు దాటేలా షాట్స్ కొడుతున్నాడు. ఆ బుడతడు ఆడే ఆట తీరు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇక ఇదే వీడియోను ఓ నెటిజన్ తెలంగాణ మంత్రికి కేటీఆర్‌కు ట్యాగ్ చేయగా.. ఆది చూసిన ఆయన.. “Fabulous Talent.. ఎమంటావ్ లక్ష్మణ్”.. అంటూ రీట్వీట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫ్యూచర్ లక్ష్మణ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Fabulous talent ??
What say @VVSLaxman281 @bhogleharsha https://t.co/NRz3rG927t
— KTR (@KTRTRS) January 17, 2021
కాగా బుడతడు డైపర్లు వేసుకున్నప్పుటి నుంచి ఆడుతున్న వీడియో రెండెళ్ళ క్రితమే వైరల్ అయ్యింది. అప్పట్లో ఈ వీడియోను టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు ఇంగ్లాండ్ బ్యాట్ మెన్ కెవిన్ పీటర్ సన్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ చిన్నారి తమ ఇండియా టీంలోకి తీసుకోవాలంటూ ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ కెవిన్ పీటర్ విరాట్ కోహ్లీకి కామెంట్స్ చేశాడు.
View this post on Instagram
Also Read: అబద్దం చెప్పిన పిజ్జా డెలివరీ బాయ్.. అధికారుల ఉరుగులు, పరుగులు.. లాక్‌డౌన్‌లోకి వెళ్లిన రాష్ట్రం..
ఆ హోటల్ ఐదో అంతస్థులో ఓ అంతుచిక్కని మిస్టరీ.. కిమ్‌కు మాత్రమే తెలిసిన రహస్యం..!