AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో మద్యంపై ఎంత ట్యాక్స్ ఉందో తెల్సా..? వామ్మో

తెలంగాణలో లిక్కర్ సేల్స్ ఎలా ఉంటాయో తెలిసిందే కదా..? ముఖ్యంగా పండగళ వేళ.. రికార్డు బద్దలవుతూ ఉంటాయి. అయితే ఈ మధ్య ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు విపరీతంగా అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఎందుకో తెల్సా..?

Telangana: తెలంగాణలో మద్యంపై ఎంత ట్యాక్స్ ఉందో తెల్సా..? వామ్మో
Liquor Shop
Vijay Saatha
| Edited By: |

Updated on: Nov 04, 2024 | 3:10 PM

Share

దేశవ్యాప్తంగా మద్యం సేల్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు విపరీతమైన పోటీ ఉంటుంది. కాసుల పంట ఉంటుంది కాబట్టే.. మద్యంను క్యాష్ చేసుకోవాలని ప్రతి రాష్ట్రం కూడా చూస్తుంది. ఇందుకోసం రాష్ట్రాలు తమకు నచ్చిన విధంగా పాలసీలను తయారుచేసుకుంటూ ఉంటాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మద్యం ట్యాక్స్ టాప్ అని తెలుస్తోంది లెక్కలను బట్టి. అవును… తెలంగాణలో మద్యం ట్యాక్స్ దేశంలోనే అత్యధికం.. రాష్ట్రంలోని నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL).. కేసులు గత రెండు సంవత్సరాల్లో 300% పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం, రాష్ట్రంలో 140% నుండి 250% వరకు ఉండే అధిక పన్నులు. తెలంగాణలో లిక్కర్‌పై 70% వ్యాట్ స్థిరంగా ఉండగా, ఎక్సైజ్ డ్యూటీ 70% నుండి 120% వరకు ఉంటుంది. విదేశీ మద్యం విషయంలో, ఈ ఎక్సైజ్ సుంకం 150% వరకు పెరగవచ్చు. ఇది మొత్తం పన్నును 220% నుండి 250% వరకు పెంచుతుంది. దీంతో తెలంగాణలో రేట్లు అధికంగా ఉండటం చేత.. పక్క రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తూ.. పట్టుబడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం మద్యం విక్రయాల ద్వారా అధిక ఆదాయం సాధించాలనే ఉద్దేశంతో, ఇతర రాష్ట్రాల కంటే పన్ను రేట్లను భారీగా పెంచింది. ఇప్పుడున్న రేట్ల ప్రకారం, ప్రతి మద్యం బాటిల్‌పై పన్ను 140% నుండి 250% మధ్య పన్ను ఉంటుంది. ఈ విధమైన పన్నులు రాష్ట్రం అంతటా అమలులో ఉన్నాయి. దాంతో ప్రతి బాటిల్ ఖరీదు పెరుగుతోంది.

మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల్లో అయితే 83% వరకే పన్ను ఉంది. కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లో పన్ను రేట్లు 70% నుండి 80% మధ్య ఉంటాయి. ఆయా రాష్ట్రలతో పోల్చితే మన స్టేట్‌లో పన్ను బాగా ఎక్కువ. మహారాష్ట్రలో ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే కాకుండా, పన్ను రేట్లు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా పన్ను రేట్లు తక్కువగా ఉండటం వల్ల, మద్యం కొనుగోలు ఆ రాష్ట్రాల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

తెలంగాణలో మద్యం ధరలు అధికంగా ఉండడంతో, పక్క రాష్ట్రాల నుండి అక్రమ రవాణా జరగటం ప్రారంభమైంది. ఎక్కువ రేట్లు ఉండటం వల్ల మద్యం వినియోగదారులు కర్ణాటక లేదా ఆంధ్రప్రదేశ్ వంటి సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి తక్కువ ధరలకు మద్యం కొనుగోలు చేస్తున్నారు. అలా మద్యం తరలిస్తూ దొరుకుతుండటంతో… రాష్ట్రంలో NDPL కేసులు పెరుగుతున్నాయి.

పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ అక్రమ రవాణా.. తెలంగాణ ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపుతోంది. ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావటం వల్ల, రాష్ట్రానికి తగినంత ఆదాయం అందడం లేదు. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభుత్వం మద్యం ధరలపై సమీక్ష చేయడం అవసరం. లేని పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయ వనరులను ప్రభావం పడుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి